పుట్టుకతోనే ఆ పిల్లలు ప్రపంచ రికార్డు సాధించారు. నిజానికి వాళ్ల పుట్టుకే... ఓ అరుదైన సంఘటనగా మారింది. కలిసిపుట్టిన ఆ అన్నాచెల్లెలు పుట్టగానే వార్తల్లో నిలిచారు. ప్రపంచస్థాయిలో వార్తల్లోకి ఎక్కడం అంటే అంత మామూలు విషయం కాదు. అలాంటిది ఈ పిల్లల టాపిక్ మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకంటే కవలలు పుట్టడమే నిజానికి ఓ అద్భుతం. ఒకే కాన్పులో ఒకేసారి ఇద్దరు పిల్లలు పుడతారు. అయితే కవల పిల్లలు ఒకే రోజున, ఒకేసారి పుడతారు కానీ ఈ ట్విన్స్ మాత్రం వేర్వేరు సంవత్సరాల్లో జన్మించారు. అవును.. మీరు వింటున్నది నిజమే.. వేర్వేరు తేదీలు కాదు.. ఏకంగా వేర్వేరు సంవత్సరాల్లో ఆ కవలలు పుట్టారు.
అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ఫాతిమా మాడ్రిగల్ ఈ కవలలకు జన్మనిచ్చారు. ఆమెకు డిసెంబర్ 31న పురిటి నొప్పులు రాగా.. ఆస్పత్రిలో చేర్చారు. ఆమె కడుపులో కవలలు ఉన్నారని వైద్యులు తెలిపారు. మొదటి శిశువు డిసెంబర్ 31న రాత్రి 11.45కి జన్మించాడు. తొలుత పండంటి మగబిడ్డ పుట్టాడు. అనంతరం 12 దాటిన తర్వాత మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టింది. అయితే వీరిద్దరు పుట్టింది పావుగంటలోపు. అయినా కూడా అనూహ్యంగా వారు పుట్టిన తేదీ, సంవత్సరం మారింది.
ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. తమ ఆస్పత్రిలో జరిగిన అరుదైన ఘటనగా అభివర్ణస్తూ.. సోషల్ మీడియాలో ఆ పిల్లల ఫొటోలు షేర్ చేసింది. ఆస్పత్రి యాజమాన్యం పోస్టు వైరల్ గా మారింది. వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవల ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలోనే కాదు ప్రపంచస్థాయిలో ఈ కిడ్స్ రికార్డు సాధించారు.
ఈ సంఘటనపై పిల్లల తల్లి కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. తనకు పుట్టిన కవలలు వేర్వేరు తేదీలు, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టడం చాలా ఆనందంగా ఉన్నారు. తన పిల్లలకు మాత్రమే ఈ రికార్డు దక్కిందని మురిసిపోయారు. ఇక పిల్లల పేర్లను కూడా ఆమె వెల్లడించారు. 2021 డిసెంబర్ 31న పుట్టిన మగపిల్లాడికి ఆల్ఫ్రెడ్, 2022 జనవరి 1న పుట్టిన పాపాయికి ఆలీన్ అని నామకరణం చేసినట్లు చెప్పారు. మొత్తానికి ఆ పిల్లలు పుడుతూనే భలేగా రికార్డు సాధించారు.