ఎలన్ మస్క్ కు ఊహించని షాక్ ఇచ్చిన ట్విట్టర్

Update: 2022-06-04 09:31 GMT
ప్రపంచంలోనే కుబేరుడు.. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కు ట్విట్టర్ భారీ షాక్ ఇచ్చింది. హార్ట్ స్కాట్ రోడినో యాంటీ ట్రస్ట్ ఇంప్రూవ్ మెంట్స్ యాక్ట్ ప్రకారం.. 44 బిలియన్ డాలర్లకు తమ సంస్థ కొనుగోలు చేసేందుకు ఇచ్చిన సమయం ముగిసిందని తెలిపింది. ఇప్పుడు తాము చెప్పినట్టే మస్క్ తమ సంస్థను కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేసింది.

ట్విట్టర్ కొనుగోలుకు నిరీక్షణ కాలం ముగిసిందని ట్విట్టర్ కంపెనీ శుక్రవారం తెలిపింది. ఇప్పుడు ఒప్పందాన్ని పూర్తి చేయడం మిగిలిన షరతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో ట్విట్టర్ స్టాక్ హోల్డర్ల ఆమోదం తప్పనిసరి అని పేర్కొంది. రెగ్యులేటరీ ఆమోదాలు ఉన్నాయని ట్విట్టర్ పేర్కొంది. హెచ్ఎస్ చట్టం నిబంధనలకు మేరకు భారీ లావాదేవీలపై ఫెడరల్ ట్రేడ్ కమీషన్ యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ యాంటీట్రస్ట్ డివిజన్లు రివ్యూ చేయాలి. ఈ రివ్యూ ఆధారంగా మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మరో ఆరు నెలల్లో పూర్తిగా ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఫేక్ అకౌంట్ ల గురించి సంబంధిత సమాచారం ఇవ్వాలని మస్క్ డిమాండ్ చేశారు. మస్క్ అభ్యర్థనను ట్విట్టర్ తిరస్కరించింది. దీంతో ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా హోల్డ్ లో ఉంచినట్లు మస్క్ తెలిపారు.

ట్విట్టర్ డీల్ ను ఎలన్ మస్క్ హోల్డ్ లో పెట్టాడు. ట్విట్టర్ ఫాలోవర్లలో సగం మంది ఫేక్ అనే విషయాన్ని ఆన్ లైన్ ఆడిటింగ్ కంపెనీ స్పార్క్ టోరో తెలిపారు.  ట్విటర్ ఆడిటింగ్ టూల్ స్పార్క్‌టోరో ప్రకారం.. ఎలన్ మస్క్ కు ఉన్న 87.9 మిలియన్ల మంది పాలోవర్లలో  దాదాపు 48 శాతం మంది నకిలీ అని టైమ్ నివేదించింది.

ఇందులో స్పామ్ ఖాతాలు.. బాట్ ఖాతాలు ఉండి ఉండొచ్చని.. అదీ కాదంటే వారు ట్విట్టర్ ఖాతా చాలా రోజుల నుంచి వాడి ఉండరని తెలిపింది. ప్రస్తుతం మస్క్‌కి ట్విట్టర్‌లో దాదాపు 90 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.మస్క్ మాత్రమే కాదు.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు  బిల్ గేట్స్  ఫాలోవర్లు 58.4 మిలియన్లు మరియు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా  ఫాలోవర్ల సంఖ్య మరియు 131.7 మిలియన్లలలో కూడా నకిలీలు ఉన్నారని తేల్చారు. బిల్ గేట్స్ ఖాతాలో 46 శాతం.. ఒబామా ఖాతాలో  44 శాతం మంది నకిలీ ఫాలోవర్లను కలిగి ఉన్నారని సంస్థ తేల్చింది. స్పామ్ నకిలీ ఖాతాల వల్ల ఈ సంస్థను కొనడం లేదని ఎలన్ మస్క్ తెలిపారు.

ట్విట్టర్ ను కొనేందుకు మస్క్ ఈక్విటీ ఫైనాన్సింగ్ ద్వారా 33.5 బిలియన్ డాలర్లు సేకరించారు. రుణాల ద్వారా 13 బిలియన్ డాలర్లను పొందారు. ఆ సమయంలో ట్విట్టర్ షేర్ వాల్యూ 2 శాతం పెరిగి 40.62 డాలర్లకు చేరింది.
Tags:    

Similar News