ఎంఎస్ ధోనికి షాకిచ్చిన ట్విట్టర్.. ఫ్యాన్స్ ఆశ్చర్యం

Update: 2021-08-06 13:50 GMT
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు.కారణం అతడి ట్విట్టర్ ఖాతాకు సంబంధించిన ఇష్యూ. ధోని ఖాతాకు ట్విట్టర్ బ్లూ టిక్ ను తీసేసింది. అయితే ట్విట్టర్ అలా ఎందుకు చేసిందో తెలియడం లేదని అంటున్నారు.

కొంతమంది మాత్రం ధోని సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేనందున ట్విట్టర్ ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు. ఈ ఏడాది జనవరిలో ధోని చివరగా తన ట్విట్టర్ ఖాతాలో ఏదో రాశాడు. అప్పటి నుంచి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అంతకుముందు సెప్టెంబర్ 2020లో చివరి ట్వీట్ చేశాడు. అంటే భారత మాజీ కెప్టెన్ చేసిన ఒక్క ట్వీట్ కు మరొకటి మధ్య చాలా గ్యాప్ ఉంది. దీంతో ట్విట్టర్ అతడి ఖాతా నుంచి బ్లూ టిక్ ను తీసివేసిందని చెబుతున్నారు.

అయితే మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ధోని ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూటిక్ తొలగించడంతో ప్రజలు, అభిమానులు షాక్ అవుతున్నారు.ఇప్పటికే కేంద్రమంత్రులకు ఇలానే చేసి షాక్ ఇచ్చిన ట్విట్టర్ .. ఇప్పుడు ధోనిని లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తున్నారు. వివరణ లేకుండా ఇలా చేయడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ధోని ట్విట్టర్ ఖాతా నుంచి బ్లూటిక్ ను తీసివేసిన ఇష్యూలో ఉంటే .. మరోవైపు అతడు 7 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్ పై కూడా చర్చ జరుగుతోంది.

2014లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యపతకం గెలిచిన తర్వాత ధోని చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.ధోనికి సోషల్ మీడియా ఉన్నా దాన్ని అస్సలు వాడకుండా ఈ కరోనా లాక్ డౌన్ టైంలో తన స్నిహితులు, కుంటుంబం, బంధువులతో సరదాగా గడిపేస్తున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆనందిస్తున్నాడు.ధోని భార్య మాత్రం ఈయనకు సంబంధించిన అన్ని అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటోంది.
Tags:    

Similar News