మరే సోషల్ మీడియా సంస్థతో లేని పంచాయితీలన్ని ట్విటర్ తోనే నడస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం మొదలు.. తాజాగా ప్రధాన ప్రతిపక్షం (అధికారికంగా అలాంటి హోదా లేనప్పటికి) కూడా ట్విటర్ మీద పోరు బాటు షురూ చేసింది. తాము తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాల అమలు విషయంలో తల ఎగురవేసిన పిట్ట పొగరు లెక్క తేల్చటంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ప్రభుత్వ విధానాల మీద కోర్టును ఆశ్రయించిన ట్విటర్ కు అక్కడా ఎదురుదెబ్బ తగిలేసరికి.. తత్త్వం బోధపడి.. సదరు సోషల్ మీడియా సంస్థలోని వ్యాపారస్తుడు నిద్ర లేచాడు. త్వరితగతిన విభేదాల్ని పరిష్కరించుకునే అంశం మీద ఫోకస్ పెట్టారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఆయన పార్టీకి చెందిన పలువురు ట్విటర్ ఖాతాను బ్లాక్ చేయటం.. ఆ పార్టీ ట్విటర్ మీద యుద్ధాన్నే ప్రకటించిన పరిస్థితి.
ఇలా వాడివేడిగా ఉన్న వాతావరణంలో ట్విటర్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. భారతదేశంలోకార్యకలాపాల కోసంప్రత్యేకంగా ఒక డైరెక్టర్ ను నియమించరాదని నిర్ణయించి.. ప్రస్తుతం ట్విటర్ ఇండియాకు ఎండీగా వ్యవహరిస్తున్న మనీశ్ మహేశ్వరిపై బదిలీ వేటు వేసింది. పేరుకు బదిలీ అయినా.. ఆమెకు అప్పగించిన పదవిని చూస్తే.. అది వేటుగానే భావించాలి. అంతేకాదు.. ట్విటర్ ను భారత్ లో హ్యాండిల్ చేసే బాధ్యతను ‘లీడర్ షిప్ కౌన్సిల్’ మార్గదర్శకత్వంలో జరుగుతాయని వెల్లడించింది. దీనికి సంబంధించి వివరాల్ని వెల్లడించింది. ట్విటర్ ఇండియా కీలక ఎగ్జిక్యూటివ్స్ ట్విటర్ ఓవర్సీస్ ఎగ్జిక్యూటివ్స్‌కు రిపోర్ట్ చేస్తారని పేర్కొంది. ఇక.. బదిలీ వేటు పడిన మనీశ్ ను శాన్ ఫ్రాన్సిస్కోలో కొత్త బాధ్యతల్ని అప్పగించారు. ఈ సందర్భంగా ఒక ట్వీట్ చేయటం ద్వారా.. అప్రాధాన్యత పోస్టులోకి పంపలేదని.. మనీశ్ పై ట్విటర్ ఎంతో నమ్మకం ఉందన్న భావనను కలిగేలా చేయటం గమనార్హం.
‘గడచిన రెండేళ్లకు పైనే మా భారతీయ వ్యాపారానికి నాయకత్వం వహించినందుకు మనీశ్ మహేశ్వరికి ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త మార్కెట్ల కోసం అమెరికా కేంద్రంగా రెవిన్యూ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ ఇన్‌ఛార్జిగా మీరు కొత్త పాత్ర పోషించబోతున్నందుకు అభినందనలు. ట్విటర్‌కు ముఖ్యమైన అభివృద్ధి అవకాశానికి మీరు నాయకత్వం వహించడం చూడాలని ఎంతగానో కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు. మనీశ్ స్థానంలో మరెవరిని నియమించకుండా ఉండటానికి కారణం.. భారత్ లోని పరిస్థితులేనని చెబుతున్నారు.
వ్యక్తులుగా తీసుకునే నిర్ణయాలు ఏ మాత్రం తేడా వచ్చినా.. అందుకు ట్విటర్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి పెద్ద మార్కెట్ ను దెబ్బ తీసుకోవటానికి.. ఇక్కడి ఆర్థిక ప్రయోజనాల్ని వదులుకోవటానికి ఆ సంస్థ ఎంతమాత్రం ఇష్టపడదు. అంతేకాదు.. ఇటీవల చోటుచేసుకుంటున్న వివాదాల నేపథ్యంలో.. వాటిని సమసిపోయేందుకు వీలుగా ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ట్విటర్ వ్యవహరించిన తీరుపై భారత ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.
కొత్త ఐటీ చట్టాలకు అనుగుణంగా మిగిలిన సోషల్ మీడియా సంస్థలు తమకు సంబంధించిన మార్పులు చేయగా.. ట్విటర్ మాత్రం ససేమిరా అంది. కొత్త చట్టం ప్రకారం గ్రీవియన్స్ ఆఫీసర్ తో పాటు చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్.. నోడల్ ఆఫీసర్ ను నియమించాల్సి ఉంది. మిగిలిన అన్ని సోషల్ మీడియా సంస్థలు కొత్త ఐటీ నిబందనలకు అంగీకరించినా.. ట్విటర్ మాత్రం తనకు మరింత సమయం కావాలని కోరింది. దీనికి కేంద్రం నో చెప్పింది. అంతేకాదు.. ఈ సంస్థలకు చట్టపరంగా ఇచ్చే రక్షణను కూడా ఎత్తేయటంతో కోపగించుకున్న ట్విటర్ కోర్టుకు వెళ్లింది.
అయితే.. అక్కడ ఎదురుదెబ్బలు తప్పలేదు. దీంతో.. తన తీరును మార్చుకొని.. గ్రీవియన్స్ అధికారిని నియమించటానికి నాలుగు వారాల సమయం అడిగిన ఈ సంస్థ అందుకు భిన్నంగా కేవలం నాలుగు రోజుల్లోనే నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుల విభాగానికి వినయ ప్రకాశ్ ను చీఫ్ గా ఎంపిక చేసిన అనంతరం పెద్ద ఎత్తున కంప్లైంట్లు వెల్లువెత్తాయి. తొలిసారి జులై 21న తనకు అందిన ఫిర్యాదుల నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం మే 26 నుంచి జూన్ 25 మధ్య 94 కంప్లైంట్లు రాగా.. అందుకు సంబంధించి 133 యూఆర్ఎల్స్ పై చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొంది.
ఈ నివేదికలో ఒళ్లు జలదరించే అంశాలకు వస్తే.. పిల్లల పోర్నోగ్రఫీకి సంబంధించి 18,385 ఖాతాలు.. ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్న మరో 4179 ఖాతాల్ని రద్దు చేసినట్లు పేర్కొంది. అంతేకాదు..56 ట్విటర్ ఖాతాల్ని రద్దు చేయాలన్న కంప్లైంట్ల మీద కూడా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఒక అత్యాచార నిందితురాలికి సంబంధించిన ఉదంతంలో రాహుల్ గాంధీ ఖాతాలో తమ నిబంధనలకు విరుద్ధంగా పోస్టు పెట్టారన్న ఆరోపణతో ఆయన అకౌంట్ ను బ్లాక్ చేయటం కొత్త రచ్చకు తెర తీసింది. రాహుల్ ఖాతాతో పాటు దాదాపు ఆ పార్టీకి చెందిన ఐదు వేల ఖాతాల్ని కూడా బ్లాక్ చేయటం పెను దుమారంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన ఆగ్రహాన్ని గురయ్యేలా చేసింది. దీంతో కోపగించుకున్న కాంగ్రెస్ నేతలు.. పార్టీ అబిమానులు తామంతా రాహుల్ గాంధీలమంటూ ట్విటర్ ఖాతాల పేర్లను రాహుల్ గాంధీగా మార్చుకున్నారు. రాహుల్ అధికారిక ట్విటర్ ఖాతాను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో బ్లూ టిక్ ఉన్న ప్రముఖ కాంగ్రెస్ నేతల ఖాతాలన్ని రాహుల్ గాంధీ ఖాతాలుగా మారిపోయాయి. ఇలా అటు కేంద్రంతోనూ.. ఇటు కాంగ్రెస్ తోనూ పంచాయితీ పెట్టుకున్న ట్విటర్ ఇండియా.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందో చూడాలి.