కరోనా ఎఫెక్ట్..బెజోస్ గుల్లగుల్లయ్యారే!

Update: 2020-03-04 17:39 GMT
ప్రపంచ దేశాలను తీవ్ర భయోత్పానికి గురి చేస్తున్న కరోనా వైరస్... ప్రపంచ కుబేరులను మరింతగా వణికిస్తోంది. కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు సాధారణ జనం పడరాని పాట్లు పడుతుంటే... కోట్లకు కోట్లు పడగలెత్తిన అపర కుబేరులు మాత్రం ఈ వైరస్ కారణంగా తమ ఆస్తులు ఏ మేర తగ్గిపోతాయోనన్న భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఒక్క చైనాలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఫలితంగా ఆయా దేశాలకు చెందిన అపర కుబేరుల ఆస్తులు కూడా హారతి కర్పూరంలా కరిగిపోతోంది. ఇలాంటి వారి జాబితాలో ప్రముఖ ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ చేరిపోయారు. కరోనా కారణంగా బెజోస్ ఆస్తుల్లో ఏకంగా 11.9 బిలియన్ డాలర్లు కరిగిపోయాయట.

కరోనాతో బాటు వాణిజ్య కార్యకలాపాలు స్తంభించడంతో గత కొన్ని రోజుల్లోనే కోటీశ్వరుల సొమ్ము కరిగిపోయింది. దాదాపు 500 మంది ధనికులకు సంబంధించిన 78 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయని ‘బ్లూమ్ బెర్గ్’ సంస్థ వెల్లడించింది. వీరిలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఉన్నారట. ఈ కొద్ది  రోజుల్లోనే ఆయన సంపదలో 11.9 బిలియన్ డాలర్లు హారతి కర్పూరంలా హరించుకుపోయాయట. ఈ తరుగుదల ఇంకెంత మేర ఉంటుందన్న విషయం పై వెలువడుతున్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

2016 తరువాత  ఈ ఏడాది మొట్టమొదటిసారిగా అమెజాన్ సంస్థ  ఆదాయపు పన్ను చెల్లించింది. ఇది సుమారు 162 మిలియన్ డాలర్లని , ఇక  బెవర్లీ లోని తన మేన్షన్ (భవనం) కోసం జెఫ్ 165 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశాడని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. కరోనా వైరస్ ఈ కుబేరుని సంపాదనపై తీవ్ర ప్రభావం చూపిందని, సుమారు 12 బిలియన్ డాలర్ల నష్టాన్ని అమెజాన్ మూట గట్టుకుందని ఈ సంస్థ వెల్లడించింది. ఇంత జరుగుతున్నా బెజోస్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్ తో కలిసి అమెరికాలోని ఖరీదైన హోటళ్లను విజిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడట.


Tags:    

Similar News