కట్టుదిట్టమైన భద్రతతో పాటు.. అనుమానం వచ్చిన ఎవరిని వదిలిపెట్టని ప్రగతిభవన్ భవనం బయట బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న పరిణామం అక్కడ పని చేస్తున్న భద్రతాసిబ్బందికి షాకిచ్చింది. రెప్పపాటులో చోటు చేసుకున్న ఉదంతంతో పెద్ద కలకలాన్నే రేపింది. గడిచిన కొద్దిరోజులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ? అంటూ నడుస్తున్న క్యాంపెయిన్ ను మరోస్థాయికి తీసుకెళ్లేలా చోటు చేసుకున్న ఉదంతంలో అందరిని ఆకర్షించిన ఆ యువకుడు ఎవరు? అన్నది ప్రశ్నగా మారింది.
ముఖానికి మాస్కు.. గ్లౌజులు ధరించిన చేతులతో ప్లకార్డు పట్టుకొని.. నా సీఎం ఎక్కడ? నేను తెలుసుకోవాల్సిన హక్కు నాకుందంటూ? టూవీలర్ మీద వచ్చిన వ్యక్తి.. మెరుపు వేగంతో మాయం కావటంతో పోలీసులకు దిక్కుతోచని పరిస్థితి. ప్రగతిభవన్ వద్ద ఆ యువకుల చేష్టతో రంగంలోకి దిగింది టాస్కుఫోర్సు సిబ్బంది. ప్రగతిభవన్ పరిసరాల్లోని సీసీ కెమేరాల్ని పరిశీలించిన మీదట.. ప్రగతిభవన్ వద్ద ప్లకార్డుతో వినూత్న నిరసన చేపట్టిన యువకుడ్ని గుర్తించగలిగారు.
వారిద్దరూ యూత్ కాంగ్రెస్ నేతలుగా గుర్తించారు. అందులో ఒకరు సైదాబాద్ కు చెందినకోట్ల లడ్డూ పటేల్ కాగా.. మరొకరు బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన సాయి కుమార్ లుగా గుర్తించారు. వెంటనే.. రంగంలోకి దిగిన టాస్కు ఫోర్సు సిబ్బంది వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వారు పోలీసుల విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది.