ఉగ్రవాదులకు పోలీసు పాస్ పోర్ట్ సహకారం

Update: 2015-08-18 04:13 GMT
ఎవరైనా విదేశీయులకు ఇళ్లు అద్దెకు ఇచ్చే విషయంలో ఆచూతూచి వ్యవహరించాలని.. తొందరపడొద్దని పోలీసు అధికారులు తరచూ చెబుతుంటారు. కానీ.. నగరానికి చెందిన కొందరు పోలీసులు మాత్రం కాసుల కక్కుర్తితో సరైన ధ్రువపత్రాలు లేకున్నా.. పాస్ పోర్ట్ లు జారీ చేసేందుకు వీలుగా సహకారం అందించటం విశేషం.

పదిహేను మంది బంగ్లా దేశీయులకు అక్రమంగా పాస్ పోర్ట్ లు ఇప్పించిన వ్యవహారంపై దృష్టి పెట్టిన పోలీసులకు ఆశ్చర్యపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రవాద సంస్థ హుజీ కి చెందిన సభ్యుల్ని ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. వారిని విచారించిన సందర్భంగా పలువురు బంగ్లాదేశీయులకు అక్రమపద్ధతిలో భారత్ పాస్ పోర్టులు ఇప్పించినట్లు తేల్చారు.

ఇందుకోసం కానిస్టేబుల్ బషీర్ అహ్మద్.. హోంగార్డు సలీమ్.. ఏజెంట్ అన్సారీలు బాధ్యులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపారు. విదేశీయులకు అక్రమంగా పాస్ పోర్ట్ లు ఇప్పించటంలో కొందరు పోలీసుల పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమ చేతులతో తామే ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తూ సహకారం అందిస్తున్నామన్న విషయం తెలుసో లేదో కానీ.. పోలీసులే ఇప్పుడు బాధ్యులుగా నిలవటం పట్ల మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది
Tags:    

Similar News