చైనా ఓ వివాదాస్పద దేశంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తనకు సరిహద్దులో ఉన్న అన్ని దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం ఆ దేశానికి అలవాటు. మీడియాను నియంత్రణలో పెట్టుకోవడం.. ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. ఇతర దేశాలపై పెత్తనం చెలాయించాలని నిరంతరం చూస్తూ ఉంటుంది. గాల్వాన్ కేంద్రంగా ఇటీవల ఇండియాతో కూడా ఘర్షణ పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా చైనా తన పొరుగుదేశమైన తైవాన్‌తో గొడవ పెట్టుకున్నది. నిజానికి తైవాన్ అనేది ఓ దీవి. ఆ దీవిని చైనా తన ఆధీనంలో ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. తైవాన్ మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా తైవాన్ పైనాపిల్ పండ్ల దిగుమతి విషయంలో ఇరు దేశాలకు గొడవ మొదలైంది. తైవాన్ నుంచి పైనాపిల్ పండ్ల దిగుమతిని చైనా నిలిపివేసింది. ఆ పండ్లపై రోగకారక క్రిములు ఉన్నాయని చైనా ఆరోపిస్తున్నది. దీంతో తైవాన్ భగ్గుమన్నది. చైనా తమను రాజకీయంగా ఏకాకిని చేయడానికి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని తైవాన్ అభిప్రాయపడుతున్నది. ఈ వివాదమే ఇరు దేశాలకు మధ్య చిచ్చు పెట్టింది.పైనాపిల్ దిగుమతులను చైనా నిషేధించడంతో ... వేరే దేశాల్లో ఆ పండ్లను అమ్ముకోవాలని తైవాన్ ప్రయత్నిస్తున్నది.
మరోవైపు తమ దేశ ప్రజలు కూడా ఈ పండ్లను భారీగా కొనుగోలు చేసి తినాలని సూచించింది. తైవాన్ పైనాపిల్ ఎంతో ఆరోగ్యకరమైనవి. ఈ పండ్లు ఎంతో శక్తినిస్తాయి. కొందరి రాజకీయ ప్రకటనలు ఈ పండ్ల పేరు ప్రఖ్యాతులను దెబ్బతీయలేవు. అని తైవాన్ ఉపాధ్యక్షుడు లెయ్ చింగ్-టె ట్వీట్ చేశారు.
తైవాన్‌లో ప్రతి ఏటా 4,20,000 టన్నుల పైనాపిల్ పండ్లను పండిస్తారు. ఇందులో ఈ పదిశాతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. ముఖ్యంగా చైనాకే ఎక్కువ మొత్తంలో ఎగుమతి అవుతాయి. అయితే ప్రస్తుతం చైనా నిషేధం విధించడంతో .. తైవాన్‌లో పైనాపిల్ పండ్లకు ధర తగ్గే అవకాశం ఉంది. దీంతో ఇతర దేశాలకు పైనాపిల్స్ విక్రయించాలని ఆ దేశం యోచిస్తున్నది. తైవాన్ ప్రజలు పైనాపిల్ పండ్లను కొనుగోలు చేయాలంటూ ఆ దేశ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియా వేదికగా "పైనాపిల్ ఛాలెంజ్"ను ప్రారంభించారు. ప్రపంచదేశాలన్నీ తమకు మద్దతు తెలపాలని ఆ దేశం కోరుతున్నది. తద్వారా చైనా కుట్రలను తిప్పికొట్టాలని సూచిస్తున్నది.
మరోవైపు తైవాన్‌లో ఉన్న అమెరికా, కెనడా రాయబార కార్యాలయాలు తైవాన్‌కు మద్దతుగా నిలిచాయి. తైవాన్‌లో ఉన్న 'ది అమెరికన్ ఇనిస్టిట్యూట్' తమ ఫేస్ బుక్ పేజీలో పలు పైనాపిల్ పండ్ల ఫొటోలను పోస్ట్ చేసింది. తైపైలోని కెనడా వాణిజ్య కార్యాలయం కూడా పైనాపిల్ పిజ్జా ఫొటో పోస్ట్ చెయ్యడంతో పాటూ ఈ పిజ్జా ఐడియా హవాయిది కాదని, తమ సొంత ఆలోచన అని కూడా గుర్తు చేసింది.జపాన్ వంటి దేశాల నుంచి కూడా తమకు పైనాపిల్స్ కోసం ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయని తైవాన్ ప్రకటించింది. ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో వేచి చూడాలి.