మన ఎన్నారైలు ఇంకో ప్రత్యేకతను సంతరించుకున్నారు. విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు భారత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ క్రియాశీలకంగా పాల్గొనే దిశగా అటు ప్రభుత్వం - ఇటు ఎన్నికల కమిషన్ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. గత మూడేళ్లలో ఎన్నడూలేని విధంగా విదేశీ ఓటర్ల సంఖ్య రెండు రెట్లు పెరిగిందని తాజా గణాంకాలను బట్టి స్పష్టమవుతుంది. అయితే విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్యతో పోలిస్తే ఈ ఓటర్ల సంఖ్య చాలా తక్కువని - వీరిని కూడా ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను ముమ్మర ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం - ఈసీ డేటా స్పష్టం చేస్తోంది.
సర్వీసు ఓటర్లకు అందిస్తున్నట్టుగానే ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ హక్కును కల్పించేందుకు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఎన్నారై ఒటింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో భారత్ కు వచ్చి ఓటు వేయడం అన్నది ప్రవాస భారతీయులకు అనేక రకాలుగా ఇబ్బందికరంగా మారుతున్న దృష్ట్యా - వీటికి పరోక్ష ఓటింగ్ హక్కును కల్పించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ బిల్లును తలపెట్టింది. దీర్ఘకాలంగా విదేశాల్లో ఉంటున్నప్పటికీ ఎన్నారైలు తమ ఓటు హక్కును వదులుకోలేదు. ఇప్పటికీ తాము ఓటర్లుగా నమోదైన నియోజకవర్గాల్లో ఎన్నికల సమయాల్లో ఓటు వేసే హక్కు వీరికి ఉంది. ప్రస్తుత విధానం వల్ల వీరందరూ భారత్ లో ఎన్నికల సమయంలో స్వదేశానికి వచ్చి ఓటు వేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. అయితే దీనివల్ల ఎన్నారైలు అనేకరకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ - కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వివరాల వల్ల స్పష్టమవుతోంది.
ఈ సమస్యను పరిష్కరించటంలో భాగంగా తన తరఫున పరోక్షంగా ఓటువేసే హక్కును భారతదేశంలో వున్న తమవారికి అందించే అవకాశాన్ని ఈ బిల్లు ద్వారా ఎన్నారైలకు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అన్ని ఎన్నికల్లోనూ ఓకే వ్యక్తి ఎన్నారై ఒటరు తరఫున ఓటు వేసే అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు ఈ ప్రాగ్జి ఓటరును మార్చుకోవాలన్న నిబంధన కూడా ఈ బిల్లులో ఉంది. 2012 వివరాల ప్రకారం ఇతర దేశాల్లో ఉంటున్న ఎన్నారైల సంఖ్య కోటి 37వేల మంది. వీరందరికీ కూడా దేశీయ ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే 11,846మంది విదేశీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరిసంఖ్య ఈ మూడేళ్ల కాలంలో రెండింతలైంది. దీని దృష్ట్యానే వీరి సంఖ్యను మరింతగా పెంచాలన్న ఆలోచనపై కేంద్రం దృష్టి సారించింది. తాజాగా ప్రతిపాదించిన బిల్లుకు రాష్టప్రతి ఆమోదం లభిస్తే - దేశంలో జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే ఎన్నారైల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.