టెక్సాస్ వ్యభిచార స్టింగ్ ఆపరేషన్‌లో ఇద్దరు భారతీయులు అరెస్ట్

Update: 2023-01-21 09:37 GMT
అమెరికాలో భారతీయులు వ్యభిచార స్టింగ్ ఆపరేషన్ లో దొరికారు. ఈ మధ్య దోపిడీలు, హత్యలు, దందాలు, మోసాల్లో దొరికిపోతున్న భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా టెక్సాస్ లోనూ ఓ వ్యభిచార రాకెట్ లో పట్టుబడడం కలకలం రేపింది.

వాయువ్య టెక్సాస్‌లో వ్యభిచార స్టింగ్ ఆపరేషన్‌లో దాదాపు రెండు డజన్ల మందిని టెక్సాస్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్‌బిజె ఫ్రీవే , మార్ష్ లేన్‌లోని తన ఇంటి సమీపంలో అద్దె ఇంట్లో సాగుతున్న అనుమానాస్పద కార్యకలాపాలపై పొరుగువారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడి చేసి టెక్సాస్ లో వ్యభిచార స్టింగ్ ఆపరేషన్ చేశారు.

పోలీసు విచారణలో అద్దె ఇంట్లో వ్యభిచార రాకెట్‌ను ఛేదించి, ఆపై 23 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన మొత్తం 23 మంది  వయస్సు 27-70 మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పురుషులు సెక్స్ కోసం మహిళలను ట్రాఫిక్ చేయడానికి 2 వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తున్నట్లు తరువాత గుర్తించారు.

అరెస్టయిన 23 మందిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. పోలీసులు వీరివద్ద నుంచి మూడు తుపాకులు, 6000 డాలర్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తదుపరి విచారణ జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News