ఎన్నారైలకు శిరచ్ఛేదం..ఇండియాకు మృతదేహాలు కూడా ఇవ్వలేదు

Update: 2019-04-17 15:37 GMT
మన భారతీయులకు ప్రేమలు ఎంత ఎక్కువో...  క్రమశిక్షణ అంత తక్కువ. ఆ క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇతర దేశాల చట్టాలపై అవగాహన లేక ఎంతో మంది భారతీయులు విదేశాల్లో తీవ్రమైన శిక్షలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా ఇటీవల ఇద్దరు భారతీయులకు మరణ శిక్ష విధించి శిరచ్ఛేదం ద్వారా వారిని సౌదీ ప్రభుత్వం చంపేసింది. ఈ శిక్ష సౌదీలో కొత్త కాదు.. కానీ ఇద్దరు భారతీయులను చంపేసి ఇండియా విదేశాంగ శాఖకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. రెండు నెలల క్రిత జరిగిన ఈ ఘటనలో శవాలు కూడా ఇండియాకు పంపలేదు. ఇది ఇపుడు సంచలనం అయ్యింది.

సౌదీ ప్రభుత్వం శిరచ్ఛేదం ద్వారా ఫిబ్రవరి 28న  చంఢీఘర్‌‌ లోని హోషియర్‌ పూర్‌ కు చెందిన సత్వీందర్ కుమార్ - లూథియానాకు చెందిన హర్జీత్ సింగ్‌ ల కు మరణశిక్ష విధించింది. అయితే, తన భర్త నుంచి ఎంతకీ ఫోను కూడా లేకపోవడంతో సత్వీందర్ భార్య సీమా రాణి సౌదీ విదేశాంగ శాఖకు ఒక అభ్యర్థన పంపించింది. అపుడు ఈ మరణశిక్ష విషయం వెలుగుచూసింది. 2015 డిసెంబర్ 9 న ఆరిఫ్ ఇమాముద్దీన్ హత్య జరిగింది. ఓ రోజు దోచుకున్న డబ్బును పంచుకునే విషయంలో పై ఇద్దరికి హంతకుడికి మధ్య ఓ గొడవ జరిగింది. అది హత్యకు దారితీసింది.  హర్జీత్ - సత్వీందర్‌ లకు మరణ శిక్ష తప్పలేదు.

నిజానికి  ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో నిందితులు దొరకలేదు.  తర్వాత చాలా రోజులకు మరణశిక్ష కు గురయిన ఇద్దరు తాగి గొడవపడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన విచారణలో హత్య విషయం బయటపడింది. ఇద్దరూ నేరం అంగీకరించడంతో శిరచ్చేదం ద్వారా మరణశిక్ష అమలుచేశారు.

ఇక్కడ గమనార్హం ఏంటంటే.. విచారణ క్రమంలో భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందితే మే 31 - 2017న కోర్టులో కేసు విచారణకు భారత రాయబార కార్యాలయం నుంచి ఓ అధికారి కూడా హాజరైనట్టు తెలిపారు. కానీ అనంతరం తీర్పు సమయంలో రాయబార కార్యాలయానికి ఏ సమాచారం లేదు. దీంతో రియాద్లోని భారత రాయబార కార్యాలయానికి కనీస సమాచారం లేకుండానే ఈ మరణశిక్ష అమలుచేశారు.

సత్వీందర్ భార్య వినతి అనంతరం శిక్ష గురించి వెలుగులోకి వచ్చాక మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైనా నిర్వహించుకుంటారని సౌదీ వర్గాలతో చర్చలు జరిపినప్పటికీ.. అక్కడి వ్యవస్థ అందుకు ఒప్పుకోలేదని భారత రాయబార కార్యాలయ అధికారి ప్రకాశ్ చంద్ రాసిన లేఖలో పేర్కొన్నారు.



Tags:    

Similar News