ఇద్దరు పిల్లల మధ్య చోటు చేసుకున్నచిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. గుజరాత్ లోని పటాన్ జిల్లా చనసానా పోలీస్ స్టేషన్ పరిధిలోని వడవలి గ్రామంలో ఇద్దరు విద్యార్థుల మధ్య చిన్న విషయానికి వాదులాట మొదలైంది. కాసేపటికే అదో పెద్ద గొడవగా మారింది. ఎంత పెద్దదిగా మారిందంటే.. మూడు ఊళ్ల మధ్య మతఘర్షణలు జరిగేంత పెద్దదిగా మారింది.
ఈ గొడవల్లో ఇద్దరు మృతి చెందగా.. పది మంది గాయపడ్డారు. కొంతమంది ఆందోళనకారులు రెచ్చిపోయి 50 ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో.. ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోయాయి. ఆందోళనకారుల్నినిలువరించేందుకు పోలీసులు ఏడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మృతుల్లో ఒకరు పోలీస్ కాల్పుల కారణంగా చనిపోగా.. మరొకరు మాత్రం అల్లర్లలో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున వాహనాలకు నిప్పు పెట్టారు.
తాజా గొడవల్లో జీ చౌహాన్ అనే 50 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఇది గొడవలు పెంచేందుకు కారణంగా మారింది. ఆందోళకారులు పరస్పరం ఇళ్లకు.. వాహనాలకు నిప్పుపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు పోలీసులు కిందా మీదా పడుతున్న పరిస్థితి. ఉద్రిక్త పరిస్థితిని తగ్గించి.. సాధారణ పరిస్థితుల్ని నెలకొనేలా చేయటం కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/