మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కూలీలకు భారీ విలువైన వజ్రాలు దొరికాయి. దీంతో వారి దశ తిరిగి లక్షాధికారులయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాకు చెందిన ఇద్దరు గనుల్లో కూలి పనికి వెళ్తుంటారు. అయితే ఇటీవల వాళ్లు పనిచేస్తున్న ప్రదేశంలో రెండు విలువైన వజ్రాలు దొరికాయి. ఈ వజ్రాలు ప్రస్తుతం గనుల శాఖ అధికారుల ఆధీనంలో ఉన్నాయి. అయితే వీటిని వేలం వేసి రాయల్టీ పోగా మిగిలిన మొత్తాన్ని కూలీలకు అందజేయనున్నట్టు పన్నా జిల్లా గనులశాఖ అధికారి అనుపమ్ సింగ్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘ పన్నా జిల్లాకు చెందిన దిలీప్ మిస్త్రీ, లఖన్ యాదవ్ దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. ఇటీవల కల్యాణ్‌పూర్, జర్వా పూర్ ప్రాంతాల్లోని గనుల్లో పనికి వెళ్లారు. అక్కడ వారికి భారీ విలువైన వజ్రాలు లభించాయి. అయితే సదరు వజ్రాలను గనులశాఖకు అప్పజెప్పారు.
ఆ రెండింటిలో ఒకటి 14.98 క్యారెట్లు, మరొకటి 7.44 క్యారెట్లు ఉన్నది. 14.98 క్యారెట్లు విలువైన వజ్రం రూ. 60 లక్షలు పైనే పలుకుతుంది. మరొకటి కొత్త తక్కువ ధరకు పలకొచ్చు. ఈ వజ్రాలను వేలం వేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయల్టీ పోగా మిగిలిన మొత్తాలను కూలీలకు అందజేస్తాం. ’అని ఆయన తెలిపారు. కాగా ఈ విషయంపై సదరు కూలీలు మాట్లాడుతూ.. ‘దేవుడి దయవల్ల మాకు ఇంత విలువైన వజ్రాలు దొరికాయి. అధికారులు డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. ఆ డబ్బుతో మా పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటాం’ అని సంతోషం వ్యక్తం చేశారు.