ఎన్నికలంటే మామూలు కాదు కదా. ఓటు రేటు బాగా పెరిగిపోయిన తరుణంలో ఎన్నికలంటే మరింత కష్టమే కదా. కష్టమని ఎన్నికలకు దూరంగానూ ఉండలేరు కదా. మరి ఏం చేస్తారు? ఎలాగోలా ఎన్నికలకు అయ్యే ఖర్చును సమకూర్చుకోవాల్సిందే కదా. అందుబాటులో ఉన్న నగదు, ఆప్తుల వద్ద చేతి బదుళ్లు... ఇంకా కొందరి వద్ద తప్పనిసరి అప్పులు. ఇలా అందిన కాడికి సమకూర్చుకుని ఎన్నికలకు వెళ్లారు. అప్పటిదాకా సమకూర్చుకున్న మొత్తం సరిపోలేదు. చూస్తుంటే... పోలింగ్ డేట్ దగ్గరపడుతోంది. అవతల ప్రత్యర్థి చూస్తుంటే... గుండెలు గుభేల్ మంటున్నాయి. చేసేది ఏమీ లేక అందిన చోటల్లా అప్పులు పీక్కుని వచ్చారు. ఎలాగోలా పోలింగ్ ను ముగించామనిపించారు. మరి చేసిన అప్పులు ఎలా తీర్చేది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదాయే. ఫలితాలు వెల్లడై గెలిచినట్లు ప్రకటిస్తే... ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు.
మరి ఫలితాలు రావడానికి ఇంచా చాలా సమయమే ఉంది. ఈలోగా అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులు చూస్తుండగానే పెరిగిపోతున్నాయి కదా. మరి ఏం చేయాలి? అప్పటిదాకా భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న ఆస్తులు - నెలనెలా అద్దెల రూపంలో కాసులు కురిపిస్తున్న ఆస్తులు కనిపించాయి. చేసేది లేక వాటిని తెగనమ్మడం మినహా మరో మార్గం కనిపించలేదట. అయినా ఈ తరహా పరిస్థితి వచ్చింది. ఏ చోటా మోటా నేతలకో కాదు. తమ ఎన్నికలతో పాటు పార్టీ తరఫున బరిలోకి దిగిన ఓ 50 మందికి పైగానే ఖర్చు పెట్టేంత స్తోమత ఉన్న వారే ఈ నేతలు. మరి అంత ఆస్తిపాస్తులు ఉండి కూడా ఈ దేబిరింపులు దేనికి? నిజమే.. అందరికీ వచ్చే డౌట్లే కానీ... ఆ నేతలు... సారీ మంత్రులు ఏకంగా ఎన్నికల్లో పెట్టిన ఖర్చును పూడ్చుకునేందుకు ఏకంగా తమ హోటళ్లనే అమ్మకానికి పెట్టేశారట.
అయినా హోటళ్లు అమ్ముకునేంతగా ఆ మంత్రులిద్దరూ ఎంతమేర ఖర్చు పెట్టారన్న విషయానికి వస్తే... అసెంబ్లీకే పోటీ చేసిన వారిద్దరూ ఒక్కొక్కరు రూ.75 నుంచి రూ.80 కోట్ల మేరకు ఖర్చు పెట్టారట. ఒక్క అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికకే రూ.80 కోట్లా అంటే... టీడీపీ సీనియర్ నేత - అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటలు వింటే.. రూ.80 కోట్లేంటీ? వంద కోట్లైనా పెట్టే ఉంటారనిపిస్తుంది కదా. ఈ లెక్కన ఎలాగైనా గెలవాలన్న కసితో రంగంలోకి దిగిన ఆ ఇద్దరు మంత్రులు లెక్కకు మించి ఖర్చు చేశారట. అయినా వారికి ఇప్పుడు గెలుపుపై ధీమా వచ్చిందా? అంటే... అదీ కూడా లేదట. ఇలాంటి నేపథ్యంలో ఆస్తులు అమ్ముకోక ఇంకేం చేస్తారు చెప్పండి? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ తరహా విచిత్రాలు లెక్కలేనన్ని బయటకు వస్తున్నాయి.