ఏపీలోని వైఎస్ ప్రభుత్వంలో.. ఏ విషయం మీదైనా సరే మాట్లాడటం అంటే.. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి మాట్లాడారన్న విషయం తెలిసిందే. ఒక ప్రభుత్వ సలహాదారు ఇంత చురుకుగా వ్యవహరించటం ఇప్పటివరకు చూసింది లేదు. దీనిపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయటం.. విమర్శల్ని సంధించటం లాంటివి చేయటం తెలిసిందే. సజ్జల తర్వాత రాష్ట్రంలో జరిగే పరిణామాల గురించి స్పందించే ఇద్దరు మంత్రులుగా చెప్పొచ్చు. మిగిలిన వారు మాట్లాడతారు కానీ.. చాలా తక్కువగా మాట్లాడతారని చెప్పాలి.
మాట్లాడే ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరు పేర్ని నాని అయితే.. మరొకరు కొడాలి నాని. వీరిద్దరూ అంశం ఏదైనా సరే మాట్లాడేందుకు సంశయించరు. అయితే.. తాము మాట్లాడే మాటలన్నింటిని వారు తమ పరిధిలోకి తీసుకొచ్చేసి మాట్లాడటం కనిపిస్తుంటుంది. కొడాలి నాని వ్యవహారమే తీసుకుంటే అయితే ఆయన తన కులాన్ని.. లేదంటే తానున్న క్రిష్ణా జిల్లా ప్రాంతాన్ని.. లేదంటే చంద్రబాబుపై తనకున్నపాత కోపాన్ని ప్రదర్శిస్తూ.. విషయాల్ని ఆ చట్రంలోకి తీసుకొచ్చేస్తుంటారు. పేర్ని నాని కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయటం కనిపిస్తుంటుంది.
కొత్త జిల్లాల్ని ప్రకటించిన వేళ.. క్రిష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరును పెట్టాలన్న డిమాండ్ తెర మీదకురావటం.. దీనిపై తాజాగా ఇద్దరు నానిలు వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు నానిలు ఇంచుమించు ఒకేలా మాట్లాడటం గమనార్హం. వారిద్దరు వేర్వేరుగా మాట్లాడినప్పుడు.. వారి వ్యాఖ్యలన్ని ఒకేలా ఉండటం చూస్తే.. ఎన్టీఆర్ పేరును పెట్టే విషయంలోనూ.. రంగా పేరును పెట్టే అంశంలోనూ ప్రభుత్వ ఆలోచనల్ని చెప్పే ప్రయత్నం చేశారు.
2018లోనే క్రిష్ణా జిల్లా పర్యటనలో వైఎస్ జగన్.. కొత్త జిల్లాల ప్రకటన చేశారని... ఒక్కో పార్లమెంటు స్థానాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తానని చెప్పారని.. ఆ సందర్భంలోనే క్రిష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెడతానని అప్పట్లోనే జగన్ చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు మంత్రి కొడాలి నాని. మేనిఫేస్టోలో పేర్కొన్న విధంగానే ఎన్టీఆర్ జిల్లాను డిసైడ్ చేశారన్నారు. వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టాలన్న విషయంపైనా ఇద్దరు నానిలు రియాక్టు అవుతూ.. కొత్త జిల్లాల గెజిట్ నోటిఫికేషన్ అభ్యంతరాలు ఉంటే.. వచ్చే నెల 26 వరకు అవకాశం ఉందన్నారు.
అంతలోపు ప్రభుత్వానికి తమ ఆలోచనల్ని చెప్పాలన్నారు. కొత్త జిల్లాల కసరత్తు.. ఏర్పాటు.. పేర్ల విషయాన్ని ఏదో గుడ్డిగా చేయలేదని.. పక్కాగా చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ ఏమైనా అభ్యంతరాలు.. మార్పులు ఉంటే వాటి గురించి చెప్పాలని.. వాటిపై చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇద్దరు నానిల మాటల్నిజాగ్రత్తగా వింటే.. వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టాలన్న దానిపై ప్రభుత్వం ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న విషయం వారి మాటలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికైతే వంగవీటి రంగా పేరుపై జిల్లాను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదన్న విషయం మంత్రుల చెప్పటంతో పాటు.. ఆ డిమాండ్ ను ప్రభుత్వం ఇప్పటివరకు ఆలోచించలేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారని చెప్పాలి.