ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. అంతుకు ముందే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను ప్రకటించి కర్ఫ్యూను విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లకూడదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం భయానక స్థితిలో పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.
నేడు ఏపీలో ప్రకాశం జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చీరాల నవాబ్ పేటకు చెందిన వ్యక్తి ఇటీవల దిల్లీ వద్ద ఇస్తిమాకి వెళ్లి వచ్చాడు. ఆ సమయంలో అతడికి కరోనా అంటిందట. అది బయటకు వెళ్లడి కాలేదు. కరోనా గురించి భయం లేకపోవడంతో ఇంటికి వెళ్లాడు. అతడి భార్యకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఇద్దరికి కూడా వైధ్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అంటూ వెళ్లడయ్యింది.
ప్రస్తుతం వీరిద్దరిని కూడా ఒంగోలు రిమ్స్ లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో చీరాల ఇంకా నవాబ్ పేట పరిసర ప్రాంతాలను శానిటైజ్ చేయడంతో పాటు వారితో కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరించే పనిలో రెవిన్యూ శాఖ ఇంకా పోలీసు శాఖ పడ్డట్లుగా తెలుస్తోంది. వారి బంధువులు మిత్రులను ప్రస్తుతం ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం ప్రకాశం జిల్లా వాసులను కంగారు పెడుతోంది. అధికారులు మాత్రం ఆందోళన అక్కర్లేదు ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంటే చాలు అంటూ సూచిస్తున్నారు.