దేశంలో ఇప్పటి వరకు 28 మందికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించామని సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడం...మరోవైపు హైదరాబాద్‌లోని ఓ టెకీకి కరోనా వైరస్ సోకిందనే ప్రచారం కలవరం సృష్టిస్తుండగా...తాజాగా ఇంకో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా వైరస్ సోకిందనే వార్త వైరల్ అయింది. ఆ ఇద్దరి శాంపిల్స్‌న పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు.
కరోనా వ్యాధిగ్రస్తుడి ఉదంతం బయటపడిన రెండ్రోజుల తర్వాత మరో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు తేలడం కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే, ఈ విషయంలో ప్రచారానికి అనవసర ఆందోళనకు లోనవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ఆయన రక్త నమూనాలను పుణె ల్యాబ్ కు పంపించారు. మరోవైపు గాంధీ ఆస్పత్రికి వైరస్ అనుమానితులు క్యూ కడుతున్నారు. 45 మందిని నిన్న గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికి కరోనా వైరస్ సోకలేదని గాంధీ వైద్యులు స్పష్టం చేశారు. 45 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని వెల్లడించారు. వీరంతా 14 రోజుల పాటు బయటకు రాకుండా తమ నివాసాల్లోనే ఉండాలని సూచించినట్లు డాక్టర్లు చెప్పారు.
కాగా, హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ బిల్డింగ్ నెంబర్ 20లోని 9వ ఫ్లోర్ లోఉన్న DSM కంపెనీలో ఓ మహిళా ఉద్యోగికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవడంతో ఐటీ కారిడార్‌లో వణుకు మొదలైంది. కరోనా పాజిటివ్ రావడంతో కంపెనీతో పాటు బిల్డింగ్ లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఇంటినుంచి పనిచేయమని పంపించేశారు. దాదాపు మూడు వేల మంది ఇంటికి వెళ్లిపోయారు. కంపెనీ యాజమాన్యం చెప్పేవరకు ఆఫీసుకు రావద్దంటూ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. దీంతో మైండ్ స్పేస్ పరిసరాలన్నీ ఒకింత ఖాళీ అయ్యాయి.