ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా ఉన్న ముస్లిం సామాజికవర్గాన్ని ఏకం చేసి సీట్లను కొల్లగొట్టేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విస్తృతంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ హైదరాబాద్ ఎంపీపై కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కాల్పుల్లో అసదుద్దీన్ ఓవైసీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఓవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఓ కారు పంక్చరైంది.
మీరట్ లో ప్రచారం అనంతరం ఢిల్లీకి తిరిగి వస్తుండగా చాజర్సీ టోల్ గేట్ వద్ద నిందితులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే మాజీ మేయర్ హుస్సేన్ నిందితుడిపై కారు ఎక్కించారు. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయి.
కాగా ఓవైసీపై దాడి చేసిన కేసులో ఇద్దరు షూటర్లను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు కాన్వాయ్ పై కాల్పులు జరిపిన నిందితులు యూపీ పోలీసులకు వెల్లడించినట్టు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని విచారిస్తున్నారు.
విచారణలో ఓవైసీ హిందూ వ్యతిరేక ప్రకటనలతో బాధపడి ఈ చర్యకు పాల్పడ్డామని వారు పేర్కొన్నారని తెలిపారు.
ఇక పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఈ ఘటన అనంతరం అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తనపై కాల్పుల ఘటనపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతోపాటు కేంద్రప్రభుత్వం కూడా దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ ను కూడా కలుస్తానని తెలిపారు. ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలని ఎన్నికల కమిషన్ ను అసదుద్దీన్ కోరారు. అంతేకాకుండా ఈ రోజు లోక్ సభలో సైతం దీనిపై అసదుద్దీన్ మాట్లాడనున్నారు. దీంతో పాటు ఈరోజు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు తెలుపాలని ఎంఐఎం కార్యకర్తలకు అసద్ పిలుపునిచ్చాడు.