కర్ణాటకలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. వ్యాపార లావాదేవాల్లోని తేడాలతో హత్య జరిగిందని పోలీసులు భావించారు. ఆ దిశగా విచారణ కొంత జరిగింది. అయితే.. అంచనాలకు భిన్నమైన ట్విస్టు ఒకటి చోటు చేసుకుంది. దారుణ హత్య వెనుక షాకింగ్ నిజాన్ని పోలీసులు గుర్తించారు.
సదరు వ్యాపారి మూడో పెళ్లి కక్కుర్తి ప్రాణాలు పోవటానికి కారణమని తేలింది. అందుకు భార్యే కారణంగా పోలీసులు గుర్తించారు.
బెళగావి భవాని నగరానికి చెందిన 46 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దారుణ హత్యకు గురయ్యారు. ఇతగాడికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్లు గుర్తించారు. మొదటి భార్య లాతూరులో ఉంటే.. రెండో భార్య అతడితోనే ఉంటోంది. ఇదిలా ఉంటే.. ఇద్దరు భార్యలు సరిపోనట్లుగా మూడో పెళ్లి చేసుకోవటంతో రెండో భార్య కిరణ రగిలిపోయింది. దీనికి తోడు ఆస్తి తగదాలు కూడా కారణమన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
రాజుకు ఉన్న ఆస్తిని తన పిల్లల పేరు మీద పెట్టాలని కిరణ ఒత్తిడి చేసింది. అయితే.. అందుకు అతడు నో చెప్పటంతో కోపాన్ని పెంచుకుంది. దీనికి తోడు మూడో పెళ్లి చేసుకోవటాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె.. భర్తను చంపాలని ప్లాన్ చేసింది. ఇందుకు తన భర్తతో వ్యాపారం చేసి విభేదాలతో విడిపోయిన భాగస్వామ్యులు ధర్మేంద్ర.. శశికాంత్ తో మర్డర్ ప్లాన్ చేసింది.
సంజయ్ రాజపుత్ అనే వ్యక్తికి రూ.10 లక్షలు సుపారి ఇచ్చి.. భర్తను చంపేయాలని కోరింది. దీంతో.. కారులో వెళుతున్న రాజును అడ్డుకొని.. కత్తులతో పొడిచి చంపేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. తొలుత వ్యాపార విభేదాలు ఏమైనా ఉన్నాయా? అన్న సందేహంతో ఆ దిశగా విచారణ చేపట్టారు.
అనంతరం రాజు రెండో భార్య కిరణ మీద అనుమానంతో ఆమె కాల్ డేటాను పరిశీలించారు. దీంతో.. వారి అనుమానం నిజమైంది. మూడో పెళ్లి చేసుకున్నందుకే తాను భర్తను సుపారి ఇచ్చి చంపించినట్లు కిరణ పోలీసులకు చెప్పటంతో నిందితుల్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.