యూకేలో టాప్ 500 ధనవంతుల్లో ఒకరిగా పేరొందిన భారతీయ వ్యాపారవేత్త కుటుంబ వ్యవహారం కోర్టుకెక్కడమే కాకుండా చిత్రమైన కారణంతో వార్తల్లో నిలిచింది. యూకేలో ఉంటున్న భారతీయ సంతతి దంపతులు ఆశిష్ - మీరా విడాకుల కోసం లండన్ హైకోర్టుకు వెళ్లారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు కోర్టు వీళ్ల విడాకుల కేసును విచారించనుంది. అయితే ఈ కేసులో ఓ ఆసక్తికర విషయం ఉంది. వీళ్ల ఆస్తి పంపకాల్లో ఓ స్పేస్ టికెట్ కూడా ఉంది. నిజానికి విడాకుల తర్వాత భార్యకు భారీగా భరణం ఇవ్వాల్సి వస్తుందని భావించిన ఆశిష్ థక్కర్.. తన ఆస్తి మొత్తం విలువ 4,45,532 పౌండ్లేనని కోర్టుకు చెప్పాడు. అయితే అతని భార్య మీరా మానెక్ మాత్రం ఆశిష్ బిలియనీర్ అని, అతని దగ్గర లక్షా 60 వేల పౌండ్ల విలువైన స్పేస్ టికెట్ కూడా ఉందని వాదిస్తోంది. అసలు ఈ స్పేస్ టికెట్ సంగతే మొత్తం ఎపిసోడ్ లో ఆసక్తికరం.
బిజినెస్ టైకూన్ రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గగాక్టిక్ పేరుతో తొలి కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ ను భవిష్యత్తులో పంపించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి టికెట్ కొన్న అతికొద్ది మందిలో ఆశిస్ థక్కర్ కూడా ఒకడు. ఇప్పుడా టికెట్ విలువలోనూ తనకు వాటా ఇవ్వాలని అతని భార్య మీరా పట్టుబడుతోంది. ఈ వాదనను మీరా హైకోర్టులో వినిపించనుంది. విడాకుల కేసును ఐదు రోజుల పాటు విచారించనున్న లండన్ హైకోర్టు.. అసలు ఆశిష్ ఆస్తుల విలువ ఎంత? అందులో మీరాకు విడాకుల సెటిల్ మెంట్ కింద ఎంతివ్వాలన్నదానిపై తీర్పు ఇవ్వనుంది. థక్కర్ దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త. మారా గ్రూప్‌ను నడిపిస్తున్నాడు. ఉగాండా నుంచి 1970ల్లో అతని ఫ్యామిలీ యూకేకు వలస వెళ్లింది. 2008లో మీరాను పెళ్లి చేసుకున్నాడు థక్కర్. 2013లో వీళ్లు విడిపోయారు. 2015లో సండే టైమ్స్ ప్రచురించిన ధనవంతుల జాబితాలో 500 మిలియన్ పౌండ్లతో థక్కర్ కూడా ఉన్నాడు. అలాంటి ధనవంతుడు ఈ విధంగా కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/