టైరు పేలితే దేవుడి పేరు చెబితే సరిపోదు.. పరిహారం కట్టాల్సిందే.. తేల్చిన ఆ హైకోర్టు!
వాహనం నడుస్తున్న వేళ.. హటాత్తుగా టేరు పేలితే? అలా పేలిన టైరు కారణంగా నష్టం వాటిల్లితే? దాన్ని దేవుడి చర్యగా భావించాలా? మానవ తప్పిదం కిందకు వస్తుందా? తాజాగా ఇదే వివాదంపై బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. టైరు పేలి.. వాహనం నడుపుతున్న వ్యక్తికి నష్టం వాటిల్లితే.. దానికి పరిహారం చెల్లించకుండా తప్పించుకునే వైఖరిని న్యాయస్థానం తప్పు పట్టింది.
దేవుడి పేరు చెప్పి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తూ జారీ చేసిన ఆదేశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకూ అసలేం జరిగిందంటే?
2010 అక్టోబరు 25న ముప్ఫై ఎనిమిదేళ్ల మకరంద్ పట్వరదన్ మరో ఇద్దరితో కలిసి ఫూణె నుంచి ముంబయికి కారులో బయలుదేరారు. కారు మకరంద్ ది కాదు. ఆయన స్నేహితుడిది. ఆ ప్రయాణంలో అనూహ్యంగా వెనుక టైరు పేలింది. దీంతో పట్టుతప్పిన కారు.. లోయలో పడి మకరంద్ పట్వర్దన్ మరణించాడు. దీంతో.. అతడి కుటుంబం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ తమకు పరిహారం చెల్లించాలని కోరగా..అందుకు సదరు సంస్థ నో చెప్పింది.
దీంతో.. బాధితుడి కుటుంబం ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనను విన్న ట్రైబ్యునల్ బాధితుడికి పరిహారం చెల్లించాల్సిందేనని పేర్కొంది. అయినప్పటికీ బీమా సంస్థ.. బాంబే హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘకాలం పాటు వాదనలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటిని విన్న బొంబాయి హైకోర్టు తాజాగా కీలక తీర్పును వెలువరించింది.
టైరు పేలటం దేవుడి చర్యతో పోల్చటం సరి కాదని.. అది కచ్ఛితంగా మానవ తప్పిదమే అవుతుందని పేర్కొంది. ఇందులో భాగంగా బాధితుడి కుటుంబానికి రూ.1.25 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందేనని పేర్కొంది.
టైరు పేలటం లాంటి ఘటనల్ని దేవుడి పేరుతో తప్పించుకోవటం కుదరదని చెప్పిన హైకోర్టు తీర్పు.. రానున్న రోజుల్లో ఎంతో మందికి మేలు చేస్తుందని మాత్రం చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.