ఓ బాలుడు తన చిన్నతనంలో దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటాడు....సమాజం అతడిని చులకనగా చూసి హేళన చేస్తుంది.....సమాజంపై - ఇరుగుపొరుగు వారిపై ఆ బాటుడు కక్ష్య పెంచుకుంటాడు.....అతడు పెరిగి పెద్దయ్యాక తనను అవమానించిన సమాజం - వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకుంటాడు....తనను ఇబ్బందిపెట్టిన వారిని తుదముట్టిస్తాడు....ఇదంతా చాలా సినిమాల్లో కనిపించే రొటీన్ స్టోరీ. అయితే, అచ్చు గుద్దినట్లు ఇదే తరహాలో ఫ్రాన్స్ లో ఓ ఘటన జరిగింది. ఫ్రాన్స్ లోని బోర్డియక్స్ నగరంలో ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లకు రాత్రికి రాత్రే పంక్చర్లు పడుతున్నాయి. రాత్రి లక్షణంగా ఉన్న టైర్లలోని గాలి పొద్దుపొడిచేసరికి మాయమైపోతోంది. మొదట ఈ పంక్చర్ల వ్యవహారాన్ని స్థానికులు సాధారణ సమస్యగా భావించారు. అయితే, రోజురోజుకూ పంక్చర్ల బారిన పడే వాహనాల సంఖ్య పెరిగిపోవడాన్ని గుర్తించారు. ఒకటి కాదు రెండు కాదు....ఏకంగా 6 వేల కార్లకు అతడు పంక్చర్లు చేశాడు. దీంతో, ఇది ఎవరో కావాలని చేస్తున్న పనేనని స్థానికులు నిర్ధారణకు వచ్చారు. ఆ పంక్చర్లు చేస్తున్న వ్యక్తి దేవాంతకుడిలా తనను గుర్తుపట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తేల్చారు. చివరకు పోలీసులు కూడా ఆ `సీరియల్ పంక్చరర్` ను కనిపెట్టలేకపోయారు. ఎట్టకేలకు ఓ స్థానికుడు ఆ వ్యక్తిని సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు పట్టించాడు. దీంతో, ఆ వ్యక్తి ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు.
ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ నగరానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి చిన్నప్పటి నుంచి నిరాదరణకు గురయ్యాడు. అతడి బాల్యంలోని పరిస్థితుల కారణంగా సమాజంపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. దాంతోపాటు అతడిని ఒంటరితనం కూడా వేధించ సాగింది. దీంతో, సమాజంపై, ఇరుగుపొరుగు వారిపై కక్ష సాధించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో, సమాజాన్ని ఇబ్బంది పెట్టే క్రమంలో స్థానికుల ఇళ్లల్లోని కార్లకు పంక్చర్లు వేయడం ప్రారంభించాడు. తద్వారా వారిపై కసి తీర్చుకోవాలని అతడి కోరిక. ఈ విధంగా 2011 నుంచి రోజుకు 70 కార్ల చక్రాల నుంచి గాలి తీసేశాడు. అతడిచ్చిన లెక్కల ప్రకారం దాదాపు 6 వేలకు పైగా కార్లు ఇతగాడి బారిన పడ్డాయని పోలీసులు నిర్ధారించారు. ఆ సీరియల్ సూదిగాడిపై దాదాపు 1100లకు పైగా కేసులు నమోదయ్యాయి.
ఇతడేమీ అల్లాటప్పా వ్యక్తి కాదు. బ్యాంకు దోపిడీలు - దొంగతనాలకు పాల్పడే వారిలానే సీసీకెమేరాలకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. ప్రతిరోజూ రాత్రి 2 నుంచి 5 గంటల మధ్య మాత్రమే పంక్చర్లు తీసుకునేవాడు. దీంతో, పోలీసులకు సీరియల్ సూదిగాడి వ్యవహారం సవాల్‌గా మారింది. చివరకు ఈ సీరియల్ సూదిగాడిని ఓ స్థానికుడు ఫోటో తీసి పోలీసులకు అందించాడు. దీంతో గురువారం రాత్రి పోలీసులు ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకున్న తరహాలో వలపన్ని మరీ అతడిని అరెస్టు చేశారు. అయితే, ఏరోజు ఏ ఇంటికి వెళ్లాలి, ఎన్ని కార్లకు పంక్చర్లు వేయాలి? ఎక్కడెక్కడ సీసీ కెమేరాలు ఉన్నాయన్న విషయాలపై పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ పంక్చర్లు చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ వివరాలను కోడ్ భాషలో ముందే రాసుకోవడం విశేషం. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ‘పంక్చర్ షెడ్యూల్’ ను కూడా ఈ మహానుభావుడు సిద్ధమవ్వడం కొసమెరుపు!