తెలుగోళ్లంతా అటెన్షన్ ప్లీజ్.. యూఎస్ వీసా.. అడ్రస్ మారింది

Update: 2023-01-06 04:16 GMT
డాలర్ డ్రీమ్స్ కు మొదటి అడుగు ఆ దేశం జారీ చేసే వీసా. మరి.. ఈ వీసా కోసం పడే తిప్పలు అన్ని ఇన్ని కావు. వీసా దాకా ఎందుకు? అసలు వీసా అపాయింట్ మెంట్ కోసమే కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇదిలా ఉంటే..

తాజాగా హైదరాబాద్ లోని అమెరికా వీసా అప్లికేషన్ సెంటర్ అడ్రస్ మారిందన్న విషయాన్ని తెలుగువారంతా గుర్తించాల్సిన అవసరం ఉంది. తంలో మాదిరి కాకుండా.. ఈ నెల 8 నుంచి అంటే.. ఆదివారం నుంచి అమెరికా కాన్సులేట్ లో సమర్పించాల్సిన వీసా అప్లికేషన్ సెంటర్ ను మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రకటనను చూస్తే.. అమెరికా వీసా కోసం అప్లై చేసే వారు.. ముందుగా తమ అప్లికేషన్ ను వీసా అప్లికేషన్ సెంటర్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం జనవరి 8 నుంచి  మాదాపూర్ లోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కు వెళ్లాల్సి ఉంది. మెట్రో స్టేషన్ లోని లోయర్ కాన్ కోర్సులో కొత్త వీసా అప్లికేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా అమెరికన్ కాన్సులేట్ ప్రకటించింది.

వీసా కోసం ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారు మాత్రమే కాదు.. డాక్యుమెంట్లు సమర్పించేందుకు.. పాస్ పోర్టును తిరిగి తీసుకోవాలనుకునే వారంతా కూడా మారిన కొత్త అడ్రస్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న బేగంపేట కార్యాలయంతో పోలిస్తే.. హైటెక్ మెట్రో స్టేషన్ లోని లోయర్ కాన్ కోర్సు అందరికి సులువుగా ఉంటుందని చెప్పొచ్చు. సో.. మారిన అడ్రస్ గురించి అప్డేట్ కావాల్సి అవసరం ఉందరికి ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News