సాధారణంగా మనం ఏదైనా దేశం వెళ్లాలన్నా - విదేశీయులు మన దేశం రావాలన్నా వీసా తప్పనిసరి. కానీ, ఉబర్ సహ వ్యవస్థాపకుడు - చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రావిస్ కలానిక్ వీసా లేకుండా భారత్ కు వచ్చారు. ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారిన నేపథ్యంలో అత్యున్నతస్థాయి వర్గాల జోక్యంతో సంకటస్థితి నుంచి బయట పడ్డారు. వచ్చేనెల 16న భారత్ లో జరిగే స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం ఆయన బీజింగ్ నుంచి ఇక్కడకు విమానంలో వచ్చారు. అయితే విమానం దిగిన తర్వాత తాను వీసా లేకుండా భారత్ కు వచ్చినట్టు తర్వాత గుర్తించారు!
దీంతో పరిష్కార మార్గాల కోసం ప్రయత్నించగా...కేంద్ర హోంశాఖ కార్యదర్శి - ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉండటానికి ఆయనకు అనుమతి లభించింది. తాను వీసా లేకుండా రావడం భయానక పరిస్థితిగా ట్రావిస్ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఈ పరిస్థితి నుంచి తనను బయటపడేశారని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తన వీసాలో తప్పు దొర్లిందని, అమెరికాలో 11/12 తొలుత నెల తర్వాత తేదీ రాస్తారని - భారత్ లో తేదీ 12/11 తర్వాత నెల రాస్తారని, దాంతో తాను బీజింగ్ నుంచి ఢిల్లీకి వీసా లేకుండా ప్రయణించాల్సి వచ్చిందని ట్రావిస్ పేర్కొన్నారు. ఆసియాలో ఉబర్ మూడో అతిపెద్ద ఆర్థిక సంస్థగా ఉంది. అలాంటి వ్యక్తి ఇలా చిక్కుల పాలవడం నిజంగా ఆసక్తికరమే!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/