గర్జించే పులి నోట సారీ మాట వస్తుందా? మామూలుగా అయితే రాదు కానీ.. ‘రాజకీయ పులి’ అయిన శివసేన అధినేత నోటి నుంచి తాజాగా వచ్చిన సారీ మాట ఆసక్తికరంగా మారింది. ఎవరిపైనైనా.. ఎలాంటి అంశంలో అయినా తమదైన శైలిలో విరుచుకుపడే తత్వం ఎక్కువగా ఉండే ఉద్దవ్ ఠాక్రే వెనక్కి తగ్గారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలోనూ.. ఎవరిపైనైనా విరుచుకుపడటంలో ఆయనకు తీరు కాస్త భిన్నం. వివాదాలకు ఏ మాత్రం వెరవని ఆయన నోటి నుంచి క్షమాపణ రావటం చిన్న విషయం కాదు. ఇలాంటి పరిస్థితి ఉద్ధవ్ ఠాక్రేకు ఎలా ఎదురైందన్న విషయంలోకి చూస్తే.. మితిమీరిన దూకుడే దీనికి కారణంగా చెప్పాలి. విద్య.. ఉద్యోగాల్లో కోటా తదితర డిమాండ్లపై మరాఠీలు కొద్దికాలంగా చేస్తున్న నిశ్శబ్ద నిరసనపై తాజాగా శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వచ్చిన కార్టూన్ తాజాగా పెను వివాదానికి కారణమైంది.
మహారాష్ట్ర వ్యాప్తంగా మరాఠాలు చేపట్టిన నిశ్శబ్ద ప్రదర్శనల్లో మహిళల భాగస్వామ్యం ఎక్కువ. అలాంటిది వారి మనోభావాలు దెబ్బ తీసేలా సామ్నాలో ఒక కార్టూన్ ప్రచురితమైంది. దీనిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. తమకు మహిళలంటే గౌరవమని.. వారిని కించపర్చటం తమ ఉద్దేశం కాదన్న ఆయన.. కార్టూన్ కారణంగా ఎవరినైనా గాయపరిచి ఉన్నా.. పార్టీ అధినేతగా.. సామ్నా పత్రికకు ఎడిటర్ గా తాను క్షమాపణలు చెబుతున్నట్లుగా వెల్లడించారు. సామ్నాలో ప్రచురితమైన కార్టూన్ మరాఠా మహిళల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అదే గర్జించే పులి చేత సారీ చెప్పించింది. చూస్తూ.. చూస్తూ మహిళలతో పెట్టుకోవాలని ఏ పార్టీ మాత్రం కోరుకుంటుంది చెప్పండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/