మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫాలో అవుతున్నట్లు కన్పిస్తుంది. ఆయన తొలిరోజే ప్రకటించిన పథకాలు కానీ వాళ్లు ప్రణాళికలు కానీ చూస్తుంటే దక్షిణాది రాష్ట్రాలైన మహారాష్ట్ర ఉందని స్పష్టంగా అర్థం అవుతోంది. కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన కూటమి ఏర్పడిన మహారాష్ట్ర వికాస్ తరఫున సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కూటమి తమ పాలనా ప్రణాళికను రిలీజ్ చేసింది. దాన్ని కనీస ఉమ్మడి కార్యక్రమంలో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో సిఎంపి అని చెబుతోంది. సీఎంపీలో భాగంగా ఏమేం పథకాలు అమలు చేస్తామో కూడా చెప్పారు. ఇవన్నీ ప్రజాకర్షక పథకాలే కావడం విశేషం.
సాధారణంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ఎక్కువగా ప్రజాకర్షక పథకాలు కనిపిస్తూ ఉంటాయి. రెండు రూపాయలకు కిలో బియ్యం కావచ్చు ఐదు రూపాయలకే భోజనం కావచ్చు లేకపోతే ఇంకా తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ లో ఎంజీ రామచంద్రన్ - జయలలిత - కరుణానిధి - ఎన్టీ రామారావు - వైఎస్ రాజశేఖరరెడ్డి - చంద్రబాబు వంటి నాయకులు అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్ని ఆకట్టుకోగలిగారు. ఇప్పుడు అదే ఫార్ములాను మహారాష్ట్రలో అమలు చేసి మంచి పేరు తెచ్చుకోవడానికి మళ్లీ మళ్లీ అధికారం అందుకోవడం కానీ ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించిన పథకాలను చూస్తే చాలా వరకు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న పథకాలు స్వల్ప మార్పులతో అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు అని అర్థమవుతుంది.
ప్రధానంగా 10 రూపాయలకే కడుపునిండా భోజనం పెట్టే పథకం. ఇది తమిళనాడులో అమ్మ క్యాంటీన్ వంటిదే. అమ్మ క్యాంటీన్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదులో జిహెచ్ ఎంసి ఆధ్వర్యంలో కూడా ఐదు రూపాయలకే భోజనం పథకం అమలవుతుంది. అలాగే ఆ పక్కనే ఉన్న ఒడిషా లో కూడా 5 రూపాయల భోజన పథకం ఉంది. ఈ రాష్ట్రాల్లో ఉన్న ఈ పధకానికే స్వల్ప మార్పులతో పది రూపాయలకు భోజనం పథకంగా మార్చి మహారాష్ట్రలో అమలు చేయబోతున్నారు.
ఇంకో ప్రజాకర్షక పథకం ఒక్క రూపాయికి పేదలకు వైద్యం అందించడం ఇది కూడా తమిళనాడులో గాని లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వంటిదే. మూడోది 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఉండేలా చూస్తామని చెప్తున్నారు ఇది కూడా ప్రజాకర్షక పథకమే. రైతుల సమస్యలను అడ్రస్ చేయడానికి కూడా కొన్ని పథకాలను ప్రవేశపెట్టారు. అకాల వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే సాయం అందించడం - రుణమాఫీ - రైతులకు గిట్టుబాటు ధర వంటివి ఉద్ధవ్ చెప్పారు. రుణమాఫీ తెలుగు రాష్ట్రాల్లో అమలైన పథకమే ఇక వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణం వంటివి కాస్త భిన్నమైన పథకాలు. మొత్తంగా చూసుకుంటే ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రిగా ప్రజాకర్షక పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.