విశ్వాస పరీక్ష నెగ్గిన వికాస్ అఘాడీ ప్రభుత్వం ..!

Update: 2019-11-30 11:17 GMT
దాదాపుగా రెండు నెలల ప్రతిష్టంభన తరువాత  మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటైంది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మహారాష్ట్రలో ఏర్పాటు అయ్యింది. ఈ నేపథ్యంలో  ఇక సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన విశ్వాస పరీక్షలో ఉధ్దవ్ థాక్రే ప్రభుత్వం విజయం సాధించింది. బలపరీక్షకు ముందే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు లేకుండానే ప్రొటెం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ఉద్ధవ్‌ 169 ఓట్లతో గెలుపొందారు. ఇద్దరు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు - ఒక సీపీఐ(ఎం)ఎమ్మెల్యే - ఒక ఎమ్ ఎన్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మాణానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓటు వేయకుండా తటస్థంగా ఉండిపోయారు.

అంతకు ముందు విశ్వాస పరీక్షను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ చవాన్ తీర్మానం ప్రతిపాదించగా - తర్వాత ఎన్‌సీపీ ఎమ్మెల్యే నవాబ్ మాలిక్ - శివసేన ఎమ్మెల్యే సునిల్ చదివి వినిపించారు. విశ్వాసపరీక్షలో నెగ్గిన అనంతరం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సెషన్ రాజ్యాంగ విరుద్ధం - అక్రమమని అసెంబ్లీ బయట ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ప్రొటెం స్పీకర్ నియామకం కూడా రాజ్యాంగ విరుద్థమన్నారు. సభ ప్రొసీడింగ్స్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ తాము గవర్నర్ కి లేఖ ఇవ్వనున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News