మహారాష్ట్ర రాజకీయం అన్నంతనే అందరి నోట్లో నానుతుంటారు శివసేన నేత సంజయ్ రౌత్. ఎంపీగా వ్యవహరించటమే కాదు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అతగాడు ప్లే చేసిన కీ రోల్ ను ఎవరూ మర్చిపోలేరు. ఎన్నికల ముందు ఎలాంటి బంధం లేకున్నా.. ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్సీపీ.. శివసేన.. కాంగ్రెస్ మధ్య రాయబారం నడపటంలో ఆయన పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు. దీనికి తగ్గట్లే ఆయనకు కీలకమైన పదవిని అప్పజెప్పారు ఉద్దవ్ ఠాక్రే.
శివసేన పత్రిక అయిన సామ్నాకు సంజయ్ రౌత్ ను చీఫ్ ఎడిటర్ గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయంతో సంజయ్ రౌత్ కు పార్టీలో ఉన్న ప్రాధాన్యత ఎంతన్న విషయం ఇట్టే అర్థమై పోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ కు.. సంజయ్ రౌత్ కు పొసగటం లేదన్న వార్తలకు బలం చేకూరేలా తాజా నిర్ణయం ఉండటం గమనార్హం.
పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతూ.. సామ్నాలో కీలకభూమిక పోషిస్తున్న ఆయనకు అధికార గణంలోనూ అంతులేని పలుకుబడి ఉందని చెబుతారు. ఇలాంటి రౌత్ కు దిమ్మ తిరిగేలా నిర్ణయం తీసుకున్నారు మహారాష్ట్ర సీఎం సాబ్. సామ్నాకు చీఫ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న సంజయ్ రౌత్ ను పక్కన పెట్టేసిన ఉద్దవ్.. తన సతీమణి రశ్శి ఠాక్రేను చీఫ్ ఎడిటర్ గా నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దీంతో.. పత్రికతో పాటు శివసేన పార్టీ మొత్తం ఉలిక్కిపడేలా చేశారు. ఎందుకిలా జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సరైన సమయం చూసుకొనే ఉద్ధవ్ తాజా నిర్ణయాన్ని తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటివరకూ సామ్నాకు చీఫ్ ఎడిటర్ గా వ్యవహరించిన సంజయ్ రౌత్ ఇకపై ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వ్యవహరించనున్నారు. ఈ పరిణామం ఇప్పటికిప్పుడు చోటు చేసుకున్నది కాదని.. గడిచిన కొంతకాలంగా ఉందంటున్నారు.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాల వేళ.. పాత విషయాన్ని కొత్తగా చర్చించుకోవటం మొదలైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి సంజయ్ రౌత్ డుమ్మా కొట్టటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. లుకలుకలు అప్పటి నుంచే ఉన్నాయని.. పార్టీ మీదా.. ప్రభుత్వం మీదా పట్టు సాధించి.. వాతావరణం తనకు అనుకూలంగా మార్చుకున్న తర్వాత.. టైం చూసుకొని రౌత్ కు ఉద్దవ్ షాకిచ్చారంటున్నారు.
ఉద్దవ్ మంత్రివర్గంలో తన సోదరుడు సునీల్ రౌత్ కు స్థానం కల్పించాలని సంజయ్ కోరటం.. అందుకు శివసేన చీఫ్ నో చెప్పటంతో కినుకు వహించి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి గైర్హాజరు కావటం ద్వారా తన మనసు మాటను బయటపెట్టేశారు. అయితే.. ఈ అంశం పెద్ద చర్చకు దారి తీయటంలో స్పందించిన రౌత్.. తాము ఠాక్రే కుటుంబానికి విదేయులమన్న మాటను చెప్పి వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి వేళలోనూ సామ్నా పత్రికకు చీఫ్ ఎడిటర్ గా సంజయ్ రౌత్ ను నియమిస్తూ ఉద్దవ్ నిర్ణయం చూసినోళ్లు అప్పట్లో ఆశ్చర్యాన్ని వ్యక్తమైంది. తనపై గుర్రుగా ఉన్న సంజయ్ కు పెద్దపీట వేయటం ఏమిటన్న ప్రశ్న వినిపించింది. ఇలాంటివాటికి తాజాగా తన నిర్ణయంతో సమాధానం చెప్పేశారు ఉద్దవ్. ఇప్పటివరకూ పార్టీలో నెంబరు 2 అన్న పేరున్న సంజయ్ రౌత్ కు సీఎం ఉద్దవ్ ఇచ్చిన షాక్ తో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.