బీజేపీ, శివసేన... ఎన్ని అవాంతరాలు, అభిప్రాయ భేదాలు వచ్చినా సుదీర్ఘ కాలంగా మిత్రపక్షాలుగానే కొనసాగుతున్నాయి. కారణం... రెండు పార్టీల అజెండాలు, తెర వెనుక అజెండాలు ఒక్కటే కాబట్టి. మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు పార్టీలు దాదాపుగా చీలిపోతాయన్న స్థాయిలో అభిప్రాయ భేదాలు పొడచూపినా... చివరకు రెండు పార్టీలు కూడా చెరో వెనకడుగు వేసి మైత్రికే జైకొట్టాయి. ఎంత మిత్రపక్షాలైనప్పటికీ... రెండు పార్టీల మధ్య నిత్యం మాటల మంటలు రేగుతూనే ఉంటాయి. ఎంత వద్దనుకున్నా కూడా ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోకుండా ఉండలేరు. అయితే ఎప్పుడు విమర్శలు వినిపించినా... చాలా త్వరగానే అవి కనుమరుగవుతూ ఉంటాయని చెప్పక తప్పదు.
ఈ క్రమంలో బీజేపీకి పూర్వ వైభవం సంపాదించి పెట్టిన నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వ తీరుపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరోసారి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ విరుచుకుపడటం ఏ రేంజిలో ఉందంటే... దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు రావాలని సవాల్ విసిరేంతగా ఉంది మరి. ఆ వివరాల్లోకి వెళితే... మొన్న భారత భూభాగంలోకి చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను అత్యంత దారుణంగా చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. పాక్ క్రూర వైఖరిపై అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశాన్ని ఆసరా చేసుకుని ఉద్ధవ్ ఠాక్రే... బీజేపీ నేతలకు దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
భారతావనిని పాలిస్తున్న నరేంద్ర మోదీ సర్కారుతో ఎంతమాత్రమూ లాభం లేదని, ప్రజల కన్నా ఆవులే గొప్పవన్నట్టు ప్రవర్తిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ కు చెందిన 'బ్యాట్' టీమ్ దేశంలోకి చొరబడి సైనికుల తలలు నరుకుతున్నా చూస్తూ ఊరకుంటోందని ఉద్ధవ్ దుయ్యబట్టారు. ప్రజలను రక్షించడం కన్నా గోవులను కాపాడటమే తమ తక్షణ కర్తవ్యంగా భావిస్తున్న బీజేపీ, దేశాభివృద్ధిని పక్కనబెట్టి, పార్టీ బలోపేతానికి మాత్రమే ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణ చేశారు.
గత రెండు రోజులుగా శివసేన కార్యాలయంలో పార్టీ కమిటీ నేతలు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన, మహారాష్ట్ర ప్రభుత్వ పనితీరునూ ఎండగట్టారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని చెబుతూ ఇతర పార్టీలను బీజేపీ భయపెట్టాలని చూస్తోందని, రేపు ఎన్నికలు జరిపించే బదులు నేడే జరిపించాలని తాను డిమాండ్ చేస్తున్నానని ఉద్ధవ్ గర్జించారు. మరి ఉద్ధవ్ కామెంట్లపై బీజేపీ అండ్ కో ఏ రీతిన స్పందిస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/