పంచాంగం కూడా జగన్ కే ఓటు వేసింది

Update: 2019-04-06 06:14 GMT
మిగిలిన పండుగలకు ఉగాదికి ప్రత్యేకత ఉంది. పండుగ వేళ.. పంచాంగ శ్రవణం ఉగాది స్పెషల్. ఆ రోజున తెలుగు కొత్త సంవత్సరాది షురూ అవుతుంది. ఇప్పటికే ఏపీ ప్రజలు విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తమ ఓటు అని చెబుతున్న వేళ.. పంచాంగ కర్తలు ఏమని చెబుతున్నారన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.

ప్రముఖ సిద్ధాంతా విష్ణుభట్ల లక్ష్మీనారాయన తన పంచాంగ శ్రవణంలో తాజాగా జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పరా్టీ బ్రహ్మండమైన విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. వికారి నామ సంవత్సర ఉగాది పండుగను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలు.. పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు.

పార్టీకి.. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి గ్రహబలం బాగుందని.. విశేష ప్రజాదరణ పొందుతారని పేర్కొన్నారు. ప్రతిపక్షం.. అధికార పక్షాల మధ్య పోరు ఉన్నా.. ప్రతిపక్షానికే అధికార యోగం ఉన్నట్లు ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఏపీ ప్రత్యేక హోదాను సాధిస్తుందన్న విషయాన్ని చెప్పారు. గ్రహగతుల ఆధారంగానే తానీ విషయాలు చెబుతున్నట్లుగా చెప్పారు.

పంచాంగ శ్రవణంలో చెప్పిన మరిన్ని విషయాలకు వస్తే.. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని.. రైతులకు మంచి లాభదాయకంగా ఉంటుందని.. వ్యవసాయం.. వ్యాపారాలు బాగుంటాయని చెప్పారు. మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరుచుకునే వీలుందని.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుందన్నారు.  దేశంలో శాంతి భద్రతలు బాగుంటాయన్నారు.

సిమెంట్.. ఇనుము ధరలు పెరుగుతాయని.. రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా పాలన సాగిస్తారని చెప్పారు. తాజా పంచాంగ శ్రవణం జగన్ పార్టీ వర్గాల్లో నైతిక స్థైర్యాన్ని మరింతగా పెంచిందని చెప్పకతప్పదు.


Tags:    

Similar News