ప్రపంచవ్యాప్తంగా మన దేశ విద్యార్థులకు కొద్దికాలం క్రితం వరకు ఎదురైన గడ్డుకాలనికి ఫుల్ స్టాప్ పడుతోంది. అమెరికా - బ్రిటన్ దేశాలు వరుసబెట్టి విద్యార్థులను ముఖ్యంగా భారతదేశానికి చెందిన వారిని వేధించడమే పనిగా పెట్టుకున్న తీరుకు స్వస్తి చెప్తున్నాయి. వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్ ప్రతినిధి రెండ్రోజుల క్రితం కోరగా...తాజాగా యునైటెడ్ కింగ్ డమ్ స్కాలర్ షిప్ ల రూపంలో తీపికబురు అందించింది.
కొన్నేళ్లుగా భారతదేశం నుంచి బ్రిటన్ లో విద్యాభ్యాసం కోసం వెళ్లే వారి సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలో మన విద్యార్థులను బ్రిటన్ బాట పట్టేందుకు ఆ దేశం అనేక నిర్ణయాలు తీసుకుంది. బ్రిటిష్ హై కమిషన్ కు చెందిన మినిష్టర్ కౌన్సిలర్(పోలిటికల్ - ప్రెస్) ఆండ్రూ సోపర్ తెలిపిన వివరాల ప్రకారం వీసాలు - స్కాలర్ షిప్ లు - విద్యాలయాల అవకతవకలను అరికట్టేందుకు పలు చర్యలు చేపట్టారు. విద్యార్థులను ఆకర్షించడానికి యూకే ప్రభుత్వం ఉపకార వేతనాలను పెంచినట్లు ఆయన తెలిపారు. గ్రేట్ బ్రిటన్ ఎడ్యుకేషన్ స్కీం కింద చదువుకోవాలనే విదేశీ విద్యార్థులకు 59 అండర్ గ్రాడ్యుయేట్, 232 పోస్టు గ్రాడ్యుయేట్ స్కాలర్ షిప్స్ అందిస్తున్నామని సోపర్ ప్రకటించారు.
ఇంతేకాకుండా తమ దేశంలోని బోగస్ కాలేజీలన్నింటినీ తొలగించామని, ఇప్పుడు గుర్తింపు పొందిన కాలేజీలు మాత్రమే ఉన్నాయని సోపర్ వివరించారు. భారతదేశంలో ఉన్న మేనేజ్ మెంట్ స్టడీస్ - ఇంజనీరింగ్ కోర్సులు అన్ని కూడా తమ దేశంలోని కాలేజీల్లో ఉన్నాయని తెలిపారు. యూకేలో చదువుకోవడం కోసం వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి మరింత సులభంగా వీసా దక్కేలా చేశామని ప్రకటించారు. పదిమంది విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటే...తొమ్మిది మందికి వీసా వచ్చేలా నిబంధలను మార్చినట్లు సోపర్ చెప్పారు. మొత్తంగా ఇటు వీసా, అటు విద్యాపరంగా తమ దేశాన్ని చదువుల క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నట్లు సోపర్ ప్రకటించడం భారతీయ విద్యార్థులకు వరం లాంటిదే.