ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల ప్రతిభకు, పని విధానానికి అగ్రతాంబూలం దక్కుతోంది. ఇప్పటికే అమెరికన్ టెక్ దిగ్గజాలను నంబర్ 1 స్థాయికి తీసుకురావడంలో భారతీయుల ప్రతిభ ఎనలేనిది. అందుకే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి వాటికి మన భారతీయులే సీఈవోలుగా ఉంటున్నారు. ఎంతో మంది టెకీలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. ట్విట్టర్ సీఈవో కూడా మన పరాగే. ఈ క్రమంలోనే యూకే కూడా భారతీయులకు పెద్దపీట వేసింది. గురువారం ప్రచురించిన తాజా యూకే ఇమ్మిగ్రేషన్ గణాంకాల్లో భారతీయులకే అత్యధిక వీసాలు జారీ చేసింది. జూన్ 2022తో ముగిసిన సంవత్సరంలో దాదాపు 1,18,000 మంది భారతీయ విద్యార్థులు స్టూడెంట్ వీసా పొందారని చూపించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 89 శాతం పెరిగడం విశేషం.
యూకేలో స్పాన్సర్డ్ స్టడీ వీసాలు జారీ చేయబడిన అతిపెద్ద జాతీయతులుగా భారతదేశం ఉంది. చైనాను అధిగమించి నంబర్ 1 స్థానంలో నిలిచింది. భారతీయ పర్యాటకులు, విద్యార్థులు, నిపుణులకు అమెరికా తర్వాత యూకే ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా కొనసాగుతోంది. మంజూరైన సందర్శకుల వీసాలలో భారతీయ పౌరులు అత్యధికంగా (28 శాతం) ఉండడం విశేషం.
జూన్ 2022తో ముగిసిన సంవత్సరంలో 2,58,000 కంటే ఎక్కువ మంది భారతీయ పౌరులు సందర్శన వీసాలు పొందారు. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 630 శాతం పెరుగుదల కావడం గమనార్హం. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రయాణ పరిమితులు ఇప్పటికీ అమలులో ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో పర్యాటకులు రావడం విశేషమే మరీ.. .
జూన్ 2022తో ముగిసే సంవత్సరంలో భారతీయ పౌరులు దాదాపు 1,03,000 వర్క్ వీసాలు పొందారు. ఇందులో నైపుణ్యం కలిగిన, కాలానుగుణ కార్మికులు కూడా ఉన్నారు. మునుపటి సంవత్సరం కంటే ఇది 148 శాతం పెరుగుదల కావడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా మంజూరైన స్కిల్డ్ వర్క్ వీసాలలో 46 శాతం వాటాను కలిగి ఉన్న భారతీయ జాతీయులు నైపుణ్యం కలిగిన వర్కర్ వీసాలు మంజూరులో అగ్ర జాతీయులుగా కొనసాగుతున్నారు.
భారతదేశంలోని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ దీనిపై స్పందించారు. "ఇండియా మళ్లీ మొదటి స్థానంలోకి వచ్చింది.. జూన్ 2022తో ముగిసిన సంవత్సరంలో భారతీయ పౌరులకు అత్యధిక సంఖ్యలో యూకేకు వెళ్లారు. అధ్యయనం, పని మరియు సందర్శకుల వీసాలు జారీలో భారతీయులకే ఎక్కువగా ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. యూకే జీవన ప్రయాణానికి ఇది మరింతగా బలం అని.. ఇరు దేశాల ప్రజలను కలుపుతుంది.’ అలెక్స్ హర్షం వ్యక్తం చేశారు. మేము వీసాల కోసం అపూర్వమైన డిమాండ్‌ను ఎదుర్కొంటున్నాము. త్వరలో కోర్సులను ప్రారంభించే విద్యార్థులను వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నట్టు అలెక్స్ తెలిపారు.
మొత్తం అమెరికా నిబంధనల పేరిట అడ్డంకులు సృష్టిస్తుంటే యూకే మాత్రం భారతీయ నిపుణులకు పెద్ద పీట వేస్తూ మన ప్రతిభను వాడుకునేందుకు రెడీ అవుతోంది. ఈ పరిణామం భారతీయులకు, అటు బ్రిటన్ దేశానికి వరంగా మారుతోంది.