సృష్టి ధర్మం తిరగబడుతోంది. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని పరిస్థితి మొత్తంగా మారిపోనుంది. ఇప్పటివరకూ ప్రసవం స్త్రీకి మాత్రమే సొంతం. దాని స్థానే.. లింగ మార్పిడి కారణంగా ఒక పురుషుడు త్వరలో ప్రసవించబోతున్నాడు. ఈ విచిత్రం బ్రిటన్ లో చోటు చేసుకోనుంది. 20 ఏళ్ల హేడెన్ క్రాస్ పురుషుడిగా లింగమార్పిడి చేసుకోనున్నారు.
ప్రస్తుతం 16 వారాల గర్భంతో ఉన్న హేడెన్.. గడిచిన మూడేళ్లుగా చట్టబద్ధంగా మగాడిలా బతికేస్తున్నారు. పుట్టుకతో స్త్రీ అయినప్పటికీ లింగమార్పిడితో మగాడిలా మారిపోయారు. నిజానికి పురుషుడిగా మారేందుకు వీలుగా హార్మోన్ చికిత్స చేయించుకోవటానికి ముందు.. భవిష్యత్తులో పిల్లల్నికనేందుకు వీలుగా తన అండాల్ని భద్రపర్చాలని ప్రభుత్వాన్ని కోరాడు.అయితే.. దీని కోసం 4వేల పౌండ్ల ఖర్చుఅవుతుందనితేల్చారు.
ఆ పెద్ద మొత్తాన్ని తాము భరించలేమని ప్రభుత్వ ఆరోగ్య సంస్థ హేడెన్ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో.. సోషల్ మీడియా సాయంతో ఒక వీర్యదాతను ఎంపిక చేసుకున్నారు. ఆపై.. గర్భం దాల్చారు. లింగమార్పిడి ద్వారా పురుషుడిగా మారిపోయిన తర్వాత బిడ్దల్ని కనే అవకాశం ఉండకపోవటంతో.. దానికి ముందే పిల్లల్నికనాలని హేడెన్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా వీర్యదాత సాయంతో గర్భవతిగా మారిన అతగాడు.. రానున్న కొద్ది నెలల్లో డెలివరీకి సిద్ధమవుతున్నాడు. తాను మంచి తండ్రిని అవుతానని చెబుతున్న హేడెన్ మాటల్ని మనోళ్లు జీర్ణించుకోవటం కాస్త కష్టమేనని చెప్పకతప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/