యూకే పీఎం రేస్: లిజ్ ట్రస్ చేతిలో ఓడిన రిషి సునక్..ఈ ప్రవాస భారతీయుడి కల చెదిరింది
భారతీయ సంతతికి చెందిన రిషి సునక్‌ను ఓడించి లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బ్రిటన్ లోని పాలక కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఆమెను ఎంపికయ్యారు. లిజ్ ట్రస్ యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆమెకు 81,326 ఓట్లు రాగా, రిషి సునక్‌కు 60,339 ఓట్లు వచ్చాయి.
లిజ్ ట్రస్ యూకే 56వ ప్రధానమంత్రి. థెరిసా మే మరియు మార్గరెట్ థాచర్ తర్వాత దేశానికి నాయకత్వం వహించే మూడవ మహిళ కావడం విశేషం. ట్రస్ సౌత్ వెస్ట్ నార్ఫోక్ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఆమె గత ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో యూకే విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు.
యునైటెడ్ కింగ్‌డమ్ కఠినమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఈ ఆర్థిక పరిస్థితిని పరిష్కరిస్తానని లిజ్ ట్రస్ హామీ ఇచ్చారు.
కొత్త ప్రధానిగా ఎన్నికైన తర్వాత, ట్రస్ మాట్లాడుతూ, "పన్నులను తగ్గించడానికి.. మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నేను ధైర్యమైన ప్రణాళికను రూపొందిస్తాను." అని తెలిపింది.
పదవీ విరమణ చేసిన ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం స్కాట్లాండ్ వెళ్లి క్వీన్ ఎలిజబెత్‌ను కలుసుకుని తన రాజీనామాను సమర్పించనున్నారు. లిజ్ ట్రస్ గత ప్రధాని జాన్సన్‌తో కలిసి ఉంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం త్వరలో ఖరారు చేయబడుతుంది.
అలాగే లిజ్ ట్రస్‌కు 2024లో ఎన్నికలలో కన్జర్వేటివ్ పార్టీని నడిపించడం పెద్ద సవాల్ గా చెప్పొచ్చు. అధికారాన్ని నిలుపుకోవడం అనేది ఆమె రాబోయే రెండేళ్లపాటు చేసే పనిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.