రష్యాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ దావా వేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో ఆందోళనలు చేస్తున్న మాస్కో అనుకూల ఏర్పాటువాదులకు వెంటనే సహాయాన్ని నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉక్రెయిన్ ఈ దావాను దాఖలు చేసింది. ఉగ్రవాద అనుకూల చర్యలు - వివక్ష - చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం వంటి పలు చర్యలకు రష్యా పాల్పడుందని నిందిస్తూ ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దావాలో పేర్కొన్నారు. కాగా ఉక్రెయిన్ ఆరోపణలను రష్యా ఖండించింది. ఆరోపణలను న్యాయబద్ధంగానే ఎదుర్కొంటామని పేర్కొంది. దావాపై ఉక్రెయిన్ అనుకూల తీర్పు వెలువడితే రష్యాకు చెందిన పలు ఆస్తులను ఆ దేశం అధికారికంగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా...యెమెన్ లో చెలరేగిన అంతర్యుద్ధం వల్ల సుమారు పది వేల మంది మృతిచెందినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. గత రెండున్నర ఏళ్లుగా యెమెన్‌లో హౌథీ రెబల్స్, సౌదీ దళాల మధ్య పోరు కొనసాగుతోంది. పదివేల మృతులతో పాటు మరో 40 వేల మంది గాయపడ్డట్లు యూఎన్ తాజాగా పేర్కొంది. ఆరోగ్య అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా మృతుల సంఖ్యను వెల్లడిస్తున్నట్లు యూఎన్ అధికారి జేమీ మెక్‌గోల్డ్‌రిక్ తెలిపారు. యెమెన్‌లో మరో కోటి మంది వరకు తక్షణ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు.
అరబ్ ప్రపంచంలో యెమెన్ అత్యంత పేద దేశం. అంతర్యుద్ధ మృతులపై ఐక్యరాజ్యసమితి తొలిసారి ప్రకటన చేయడం విశేషం. మరోవైపు ఆ దేశంలోని షాబ్వా ప్రావిన్స్‌లో హౌథీ రెబల్స్ - ప్రభుత్వ దళాల మధ్య జరిగిన అల్లర్లలో 34 మంది మృతిచెందారు. మరో 16 మంది గాయపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/