రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగసాతున్న యుద్ధం 11వ రోజుకు చేరింది. యుద్ధం నుంచి ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. ఢీ అంటే ఢీ అంటున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ రష్యా తన దాడుల తీవ్రతను మరింత పెంచుతూనే ఉంది. ఈ వారం రోజుల వ్యవధిలో 500 మిస్సైళ్లను రష్యా సైనిక బాలగాలు ఉక్రెయిన్ లోని పలు నగరాలపై సంధించింది.
ఉక్రెయిన్ కు చెందిన అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా ఇదివరకే స్వాధీనం చేసుకుంది. ఉక్రెయిన్ వాయువ్య ప్రాంతంలోని ఎనెర్హొడార్ సిటీ గల ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూరప్ లోనే అతిపెద్దది. ఈ పరిణామాల మధ్య రష్యా మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. రష్యా దూకుడును అడ్డుకోవడానికి ఉక్రెయిన్ కూడా అణ్వాయుద్దాన్ని తయారు చేసే పనిలో పడినట్లు సమాచారం.
ప్లూటోనియం ఆధారిత డర్టీ బాంబును ఉక్రెయిన్ తయారు చేస్తోందంటూ రష్యన్ మీడియా వెల్లడించింది. టీఏఎస్ఎస్, ఆర్ఐఏ, ఇంటర్ ఫ్యాక్స్ న్యూస్ ఏజెన్సీస్ ఈ విషయాన్ని పేర్కొన్నాయి. పేరు చెప్పడానికి ఇష్టపడని విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా ఈ విషయం తెలిసిందని స్పష్టం చేశాయి.
చెర్నోబిల్ లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో డర్టీబాంబ్ తయారు చేసినట్లు రష్యా ఆరోపిస్తోంది. అణ్వాయుధాల తయారీ పట్ల తమకు ఏమాత్రం ఆసక్తి లేదంటూ పలు మార్లు స్పష్టం చేసిన ఉక్రెయిన్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకుందని.. గుట్టుచప్పుడు కాకుండా ప్లూటోనియం ఆధారిత డర్టీబాంబ్ ను తయారు చేస్తున్నట్లు పేర్కొంది.
రష్యా యుద్ధాన్ని ముమ్మరం చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ ఈ బాంబు తయారీలో నిమగ్నం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా.. తన అణ్వాయుధాలను సైతం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. బ్యారెంట్ సముద్రతీర ప్రాంతంలో న్యూక్లియర్ డ్రిల్ ను కూడా నిర్వహించినట్టు సమాచారం.