తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్ లో ఉన్న తమ పౌరులను తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో దుండగులు ఉక్రెయిన్ విమానాన్ని హైజాక్ చేసి ఇరాన్ కు మళ్లించారు. గత కొన్ని గంటలుగా ఈ వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అయితే, ఆ వార్తలు నిజం కాదని యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
ఈ విమానాన్ని కాబుల్ నుంచి ఇరాన్ కు హైజాక్ చేసినట్లు యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ డిప్యూటీ మంత్రి యెవ్‌జె నీని తొలుత వెల్లడించారు. విమానాన్ని ఆదివారమే హైజాక్ చేశారని.. మంగళవారం దాన్ని ఇరాన్ తీసుకెళ్లారని యుక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి యెవ్‌జె నీని ఉటంకిస్తూ రష్యా వార్తా ఏజెన్సీ టాస్ చెప్పింది. మరోవైపు యుక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి ఓలె నికోలింకో ఆ వార్తను ఖండించారు.
విమానం హైజాక్ నిజం కాదని ప్రకటించారు. కాబుల్ వెళ్లిన యుక్రెయిన్ విమానాలన్నీ సురక్షితంగా తిరిగొచ్చాయని స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్ లో చిక్కుకున్న యుక్రెయిన్ ప్రజలను సురక్షితంగా తేవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తమ డిప్యూటీ ఫారిన్ మినిష్టర్ చెప్పారే కానీ హైజాక్ చేశారనడం దానర్థం కాదని స్పష్టం చేశారు.
దీనిపై యుక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.83 మందితో వచ్చిన మిలటరీ కార్గో విమానం ఒకటి యుక్రెయిన్ రాజధానికి చేరిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ విమానం ఆదివారమే కాబుల్ నుంచి యుక్రెయిన్ చేరుకుందని అందులో ఉన్న 83 మందిలో 31 మంది యుక్రెయిన్ పౌరులు ఉన్నారని ఆ ప్రకటనలో వెల్లడించారు.