దేశంలోనే ఉన్నా.. ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన వీడియో

Update: 2022-02-26 06:30 GMT
రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు పారిపోలేదు. స్వయంగా యుద్ధ రంగంలోకి దిగిపోరాడుతున్నారు. ఇక రాజధానికి చేరువైనా కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు అదరడం లేదు.. బెదరడం లేదు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వీడియోను రిలీజ్ చేశారు. తనతోపాటు రాజధాని కీవ్ ను కాపాడుకునేందుకు నిలుచున్న ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి సెల్ఫీ వీడియోలో సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.

సెంట్రల్ కీవ్ లో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వీడియో రిలీజ్ చేశాడు.  తాను పారిపోతున్నానంటూ జరిగిన పుకార్లకు చెక్ పెట్టాడు.  ‘మేమంతా ఇక్కడే ఉన్నాం. మా మిలటరీ కూడా ఇక్కడే ఉంది. సమాజంలో పౌరులు ఇక్కడే ఉన్నారు. మా స్వాతంత్ర్యాన్ని కాపాడుకునేందుకు ఇక్కడే ఉన్నాం.. ఇలాగే ఉంటాం అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ చెప్పారు.  ఆ వీడియోలో  ప్రెసిడెంట్, చీఫ్ స్టాఫ్, ఇతర సీనియర్ అధికారులు ప్రెసిడెన్సీ బిల్డింగ్ బయట కనిపించారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్, మినిష్టర్ లారోవ్ ఈ చర్యలకు బాధ్యులు. కిమ్ జాంగ్ ఉన్, అలెగ్జాండర్ ల్యూకాషెంకో, బషర్ అల్ అస్సద్ లు కలిసి పుతిన్ ఒక చిన్న గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపించారు. తమపై యుద్ధానికి నార్త్ కొరియా, సిరియా, బెలారస్ లు దేశాలను కలుపుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక రొమేనియా నుంచి రెండు ఎయిర్ ఇండియా విమానాలు భారత్ కు బయలు దేరాయి. ఇప్పటికే రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఢిల్లీ, ముంబైలకు విమానాలు బయలు దేరాయి. ఉదయం 10.30 గంటలకు ఏఐ 1942 విమానం ఢిల్లీకి చేరుకుంది. మరో ఏఐ 1944 విమానం మధ్యాహ్నం ముంబైకి చేరుకోనుంది.

ఉక్రెయిన్ లోని భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. వాళ్లంతా రొమేనియా రాజధాని బుకారెస్ట్ కు చేరుకున్నాక ఎయిరిండియా విమానాల్లో భారత్ కు తరలిస్తున్నారు.











Full View


Tags:    

Similar News