దాదాపు నాలుగు నెలలుగా రష్యా యుద్ధంతో భీతిల్లిపోతోంది ఉక్రెయిన్. 70 లక్షల మంది వలస.. వేలాది మంది ప్రాణాలు బలి.. లక్షల కోట్ల ఆస్తి నష్టం.. అపార వనరులు విధ్వంసం.. ఇలా కనీవినీ ఎరుగని ఉత్పాతాన్ని చవిచూస్తోంది. ఇప్పటికీ పోరాటాన్ని ఆపేది లేదంటోంది. అలాంటి ఉక్రెయిన్ కు అతి పెద్ద ఊరటగా నిలిచే అవకాశం, ప్రపంచమంతా ఆశ్చర్యపోయి చూసే అద్భుతం చేజారిపోయింది. పైగా "సెల్ప్ గోల్" కారణంగా చేజారడం ఉక్రెయిన్ కు గుండె కోతను మిగిలించింది. తమ విజయంతో ప్రజలకు కొంతలో కొంత సంతోషాన్ని పంచాలనుకున్న ఉక్రెయిన్ ఫుట్‌బాల్ జట్టు ఆశలు ఆవివరయ్యాయి. యూరోపియన్ ప్లేఆఫ్ చివరి మ్యాచ్‌లో వేల్స్ జట్టు చేతిలో ఆదివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలై ఈ ఏడాది కతార్ వేదికగా జరిగే ప్రపంచక్‌పకు అర్హత సాధించే అవకాశాన్ని ఉక్రెయిన్ కోల్పోయింది.
గెలిచి ఉంటే ..ఫుట్ బాల్ ప్రపంచ కప్ కు అర్హత సాధించడం అంటే మామూలు మాటలు కాదు. అందుకే దానిని ఫుట్ బాల్ ప్రపంచ కప్ అనకుండా ప్రపంచ కప్ ఫైనల్స్ అంటారు. ఈ ఫైనల్స్ జాబితాలో 30 పైగా జట్లు చోటు దక్కించుకుంటాయి. కోటా ప్రకారం ఏ ఖండానికి ఆ ఖండం పోటీలు జరుగుతాయి. వాటిలో విజేతలకు బెర్తులు దక్కుతాయి. గొప్ప గొప్ప జట్లు, మాజీ చాంపియన్లే అవకాశం కోల్పోయిన సందర్భాలున్నాయి. అంతెందుకు? 2018 ప్రపంచ కప్ నకు మాజీ చాంపియన్ ఇటలీ అర్హత సాధించలేకపోయింది. 2022 నవంబరులో జరిగే ప్రపంచ కప్ నకూ ఆ జట్టు అర్హత సాధించలేదు. వరుసగా రెండుసార్లు ఇటలీ ప్రపంచ కప్ నకు దూరం కావడం ఇదే తొలిసారి. కానీ, ఉక్రెయిన్ ముందు మాత్రం అరుదైన అవకాశం నిలిచింది. వేల్స్ జట్టుపై గెలిచి ఉంటే ప్రపంచ కప్ బెర్తు దక్కేది.
అది మామూలు ప్రపంచ కప్ కాదు..క్రీడల్లో క్రికెట్ కు విపరీతంగా అభిమానులు ఉండొచ్చు. కానీ, పది,పదిహేను దేశాలకే అది పరిమితం. మహా అంటే మరో 20 అనామక (దేశాల) జట్లు. ఒలింపిక్స్ పెద్ద క్రీడా సంరంభమే కావొచ్చు. అందులో అందరికీ ఆసక్తి ఉండే ఆటలు కొన్నే. ఇక మనలాంటి దేశాలైతే.. చాలా ఆటల్లో నామ్ కే వాస్తేనే. కామన్వెల్త్, ఆసియా క్రీడలు ఇవన్నీ చెప్పుకొనేందుకే..? పెద్దగా పోటీతత్వం, రికార్డుల బద్దలు వంటి విశేషాలు ఏమీ జరగవు.
అసలు పాల్గొంటున్న జట్ల దేశాలకు చెందిన ప్రజలకే ఈ క్రీడలపై ఆసక్తి ఉండదు. కానీ, ఫుట్ బాల్ ప్రపంచ కప్ అలా కాదు. అది భూ గోళమంతటినీ ఊపేస్త్తుంది. ఉత్కఠతతో కుదిపేస్తుంది. మెరుపులతో అలరిస్తుంది. అసలు.. భారత్ కు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం లేని ప్రపంచ కప్ అయినప్పటికీ మన దేశంలో ఫుట్ బాల్ ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో ప్రజలు ఉర్రూతలూగిపోతారు. అంతటి విశేష ప్రాధాన్యం ఉంది ఫిఫా ప్రపంచ కప్ నకు.
ఉక్రెయిన్ చేజేతులా..ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ నకు అర్హత సాధించే క్రమంలో చివరి మెట్టుపై ఉక్రెయిన్ బోల్తా కొట్టింది. అది కూడా.. సెల్ఫ్ గోల్‌తో ప్రత్యర్థికి విజయాన్ని కట్టబెట్టి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆదివారం రాత్రి జరిగిన చివరి ప్లే ఆఫ్ పోరులో 34వ నిమిషంలో వేల్స్ ఆటగాడు గారెత్ బాలె ఫ్రీకిక్‌ను ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ యార్మెలెంకో పొరపాటున సెల్ఫ్ గోల్‌గా మలిచాడు.
ఆ తర్వాత ఇరుజట్ల హోరాహోరీ పోరాటంతో మ్యాచ్ పూర్తయ్యేసరికి మరో గోల్ నమోదు కాలేదు. దీంతో వేల్స్ జట్టు గోల్ తేడాతో గెలుపొంది ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది.సెల్ఫ్ గోల్‌తో ప్రపంచకప్ ఆశలు ఆవిరి కావడంతో ఆండ్రీ యార్మెలెంకో నిరాశలో మైదానంలో రోదించాడు. వేల్స్ .. యూరప్ నుంచి కప్ నకు అర్హత సాధించిన 13వ దేశంగా నిలిచింది. 22వ ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నీ ఈ ఏడాది నవంబరు 21 నుంచి డిసెంబరు 18 వరకు ఖతర్ లో జరుగనుంది.