దాదాపు రెండు నెలల యుద్ధం తర్వాత తన మద్దతుదారులకే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పెద్ద షాకిచ్చారు. బుధవారం నుంచి నాటో, యూరోపు దేశాలకు వెళుతున్న సహజవాయువు సరఫరాను ఉక్రెయిన్ నిలిపేసింది. ఉరుములేని పిడుగులాగ వెలువడిన ఉక్రెయిన్ నిర్ణయంతో అసలు సమస్య ఇపుడే మొదలవ్వబోతోంది. నాటో, యూరోపు దేశాలకు రష్యా అందిస్తున్న సహజవాయువు ఉక్రెయిన్ భూభాగం మీదుగానే వెళుతోంది.
తాజాగా ఉక్రెయిన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటినుండో ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. రష్యా నుంచి ఉక్రెయిన్ పొరుగునున్న పోలండ్, రుమేనియా, హంగరీ, బెలారస్ లాంటి దేశాలే కాకుండా జర్మనీ, ఫ్రాన్స్ లాంటి అనేక దేశాలు గ్యాస్ ను తీసుకుంటున్నాయి. పై దేశాల్లో గ్యాస్ వినియోగం ద్వారానే జనాలకు రోజులు గడుస్తాయి.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంతవరకు జనాలందరికీ గ్యాస్ తోనే పని. ఇళ్ళల్లో వంటలు, ఆటోమొబైల్ రంగం, హీటర్లు, ఆఫీసులు, రెస్టారెంట్లు ఇలా ఏది తీసుకున్నా, ఎక్కడ చూసినా గ్యాస్ తోనే నడుస్తుంటుంది.
అంటే గ్యాస్ లేకుండా జనాలు ఒక్క నిముషం కూడా ఉండలేరు. అలాంటిది ఒక్కసారిగా గ్యాస్ సరఫరా ఆగిపోయిందంటే పై దేశాల పనిగోవిందా. జర్మనీ లాంటి దేశాలైతే తమ అవసరాల్లో 70 శాతం రష్యాపైనే ఆధారపడుతున్నాయి. రష్యా గ్యాస్ సరఫరాను నిలిపేస్తే తమపనేంటనే టెన్షన్ ఇన్నిరోజులు చాలా దేశాల్లో కనబడుతుండేది. అందుకనే చాలా దేశాలు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాను బహిరంగంగా వ్యతిరేకించలేకపోయాయి.
అలాంటిది తాను అనుమానిస్తున్న సమస్య రష్యా నుండి కాకుండా లోపాయికారీగా తమ మద్దతు తీసుకుంటున్న ఉక్రెయిన్ నుండే రావటాన్ని ఈ దేశాలు ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నాయి. నిజంగా చాలా దేశాలకు ఉక్రెయిన్ పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి. ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుందో తెలీదు.
ఇఫుడు గ్యాస్ సరఫరాను నిలిపేస్తు ఉక్రెయిన్ తీసుకున్న నిర్ణయం ఎన్నిరోజులు అమల్లో ఉంటుందో తెలీదు. అప్పటివరకు తమ పరిస్ధితేంటో కూడా ఆ దేశాలకు అర్ధం కావటం లేదు. ఇప్పటికిప్పుడు ఆల్టర్నేటివ్ వెతకటం కూడా కష్టమే. దాంతో చాలా దేశాలు ఏమి చేయాలో తెలీక దిక్కులు చూస్తున్నాయి.