పక్కింటి పెద్దమ్మలా కనిపించే స్పీకర్ సుమిత్రా మహాజన్ కాస్తంత కూల్ గానే ఉంటారు. అయితే.. ఆమె సహనానికి పరీక్ష పెట్టే విపక్షాలపై అప్పుడప్పుడు మండిపడే ఆమె.. వీలైనంతవరకూ వివాదరహితంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారన్న పేరుంది.
స్పీకర్ కుర్చీకి ఉండాల్సిన గౌరవ మర్యాదల విషయంలో ఆమె తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలున్నా.. విపక్షాలు మాత్రం అప్పుడప్పుడు ఆమెను పక్షపాతిగా చిత్రీకరిస్తూ విమర్శలు చేయటం తెలిసిందే. తాజాగా అధికారపక్షానికి చెందిన కేంద్రమంత్రి ఉమాభారతిని ఉద్దేశించి స్పీకరమ్మ చేసిన వ్యాఖ్యపై ఆమె విచారం వ్యక్తం చేసి.. క్షమాపణ చెప్పారు.
స్పీకరమ్మ సారీ చెప్పే పరిస్థితి ఎందుకొచ్చిందన్న విషయానికి వెళితే.. కేంద్రమంత్రి ఉమాభారతిని శ్రీమతిగా సంబోధించారు. 56 ఏళ్ల ఉమాభారతిని అందరూ సాధ్వీగా పేర్కొంటారు.
స్పీకర్ తనను శ్రీమతిగా సంబోధించటంపై స్పందించిన ఉమాభారతి.. తాను ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదని.. భవిష్యత్తులో కూడా పెళ్లి చేసుకునే పరిస్థితి లేదంటూనే.. ఇక్కడ వేకెన్సీ బోర్డు లేదని చెప్పటంతో సభ మొత్తం ఒక్కసారి నవ్వుల పువ్వులయ్యాయి. అదే సమయంలో తాను పొరపాటున శ్రీమతి అని పిలవటంపై స్పీకర్ క్షమాపణలు చెప్పటంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసిపోయింది