తప్పులు చేయటం ఒక ఎత్తు. చేసిన తప్పుల్ని సకాలంలో సరిదిద్దుకోవటం మరో ఎత్తు. కానీ.. కొందరు మాత్రం తాము చేసింది తప్పని తెలిసినా.. వాటిని ఒప్పుకునే విషయంలో ఆలస్యాన్ని ప్రదర్శిస్తారు. దాని కారణంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు.
జరగాల్సిన ఆలస్యం జరిగిపోయిన తర్వాత ఎంత మొత్తుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజాగా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు మాజీ ముఖ్యమంత్రి.. ప్రస్తుతం మోడీ సర్కారులో కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న ఉమాభారతి. ఈ సీనియర్ బీజేపీ నేత నోటి వెంట ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది.
బీజేపీ శిఖరం అటల్ బిహారీ వాజ్ పేయి మరణం నేపథ్యంలో.. ఆయన గురించి కొన్ని గురుతుల్ని ఉమాభారతి వెల్లడించారు. ఈ సందర్భంగా అటల్ కు తాను సారీ చెప్పాల్సి ఉందని.. చెప్పకుండా తప్పు చేశానని చెప్పారు. ఆ తప్పు తనను జీవితాంతం వెంటాడుతుందని వేదన చెందుతున్నారు.
వాజ్ పేయి చాలా సరదా మనిషి అని.. ఆయన ఎప్పుడూ నవ్విస్తూ మాట్లాడేవారన్నారు. అయితే.. ఆయన హాస్యాన్ని తాను కోపగించుకున్నానని.. దీంతో అటల్ జీ బాధ పడ్డారని చెప్పారు. తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పాల్సి ఉన్నా చెప్పలేదన్నారు. ఆ బాధ తనను జీవితాంతం వెంటాడుతుందని ఆమె వెల్లడించారు. పోన్లే.. ఇప్పటికైనా ఓపెన్ అయి.. విషయం చెప్పారు కాబట్టి.. సగం బాధ తీరిందనుకోవచ్చు. అయినా.. అటల్ జీకి సారీ చెప్పటానికి ఇంత టైం అవసరమా?