కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ మెడకు చుట్టుకున్న నేషనల్ హెరాల్డ్ కేసులో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. వారికి భారీ షాక్ తగిలింది. ఢిల్లీ హెరాల్డ్ హౌస్ బిల్డింగ్ లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ సీల్ చేసింది.
మనీల్యాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఆఫీస్ ప్రాంగణం తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తాజాగా న్యూఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలోనే యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆఫీస్ కు సీల్ వేసింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.
ఇందులోనే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ట వాటాలు ఉన్నాయి. ఇక హెరాల్డ్ హౌస్ సీల్ కు సంబంధించి ఈడీ తరుఫున స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజాగా నేషనల్ హెరాల్డ్ హౌస్ తోపాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్ కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం 10 జన్ పథ్ లోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసం వద్ద, ఏఐసీసీ కార్యాలయం వద్ద అదనపు పోలీసుల బలగాలను మోహరించారు. ఆఫీస్ కు ఈడీ సీల్ వేయడంతో కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుందని ఇలా భద్రత పెంచారు.