కౌంటింగ్ రోజు ఎలా ఉండాలో చెప్పిన ఉమ్మారెడ్డి

Update: 2019-05-16 10:39 GMT
ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన నాటి నుంచి కామ్ గా ఉన్న జ‌గ‌న్ పార్టీలో గ‌డిచిన రెండు రోజులుగా వ‌రుస పెట్టి కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. పులివెందుల‌లో ప‌లు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రువుతున్న జ‌గ‌న్ ఒక‌వైపు.. మ‌రోవైపు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థుల‌తో పాటు.. కౌంటింగ్ లో పాల్గొనే వారికి శిక్ష‌ణ ఇచ్చేందుకు విజ‌య‌వాడ‌లో ఒక భారీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

విజ‌య‌వాడ‌లోని ఏ1 క‌న్వెన్ష‌న్ హాల్లో ప్ర‌త్యేక శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ అసెంబ్లీ అభ్య‌ర్థుల‌తో పాటు.. ఎంపీ అభ్య‌ర్థులు.. చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల‌కు కౌంటింగ్ పై శిక్ష‌ణ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయి.. ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు.. మాజీ సీఎస్ అజ‌య్ క‌ల్లాం.. రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ హాజ‌ర‌య్యారు.

కౌంటింగ్ రోజు తొలి ఓటు నుంచి చివ‌రి ఓటు వ‌ర‌కూ ఏజెంట్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల‌తోనే తామీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పిన వారు.. అభ్య‌ర్థులు.. ఏజెంట్ల‌కు శిక్ష‌ణ ఇచ్చారు. శిక్ష‌ణ‌లో భాగంగా 175 అసెంబ్లీ అభ్య‌ర్థులు.. 25 మంది ఎంపీ అభ్య‌ర్థుల‌తో పాటు.. చీఫ్ ఎల‌క్ష‌న్ ఏజెంట్ల‌తో స‌హా 400 మందికి ట్రైనింగ్ ఇచ్చారు.

ఏజెంట్లు.. రిజ‌ర్వ్ ఏజెంట్లు ఎంత‌మంది ఉండాలి?  వారికి ఉండాల్సిన అర్హ‌త‌ల గురించి వివ‌రించిన నేత‌లు.. రౌండ్స్ వారీగా చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల మీద ప‌క్కా ఆదేశాల్ని ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. ఒక‌వేళ ఏదైనా కార‌ణంతో కానీ.. ఉద్దేశ‌పూర్వ‌కంగా కౌంటింగ్ నిలిపివేస్తే.. త‌క్ష‌ణ‌మే రీకౌంటింగ్ నిర్వ‌హించేలా ఎన్నిక‌ల సంఘం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. పోస్ట‌ల్ బ్యాలెట్లు ఎన్ని వ‌చ్చాయో ప‌క్కాగా చూడాల‌ని.. కౌంటింగ్ హాల్లోకి వెళ్లాక ఫోన్లు వాడ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. పోలింగ్ వేళ‌.. ఏజెంట్లు ఎంత ముఖ్య‌మో.. కౌంటింగ్ వేళ అంతే ముఖ్య‌మైన నేప‌థ్యంలో.. ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన వైనంపై పార్టీ వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.


Tags:    

Similar News