విమానంలో సహ ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బెజవాడ టీడీపీ కార్పొరేటర్ చంటి అలియాస్ ఉమ్మడి వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ అక్కడ నుంచి గన్నవరం ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన సందర్భంగా ఒక మహిళా ప్రయాణికురాలిపట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు కావటం తెలిసిందే. ఒక ఎంపీ ఫోన్ చేయటంతో కార్పొరేటర్ ను వదిలేసినట్లుగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంటి ఓ ఛానల్ తో మాట్లాడారు.
విమానంలో జరిగిన విషయాన్ని చెబుతానంటూ తన వెర్షన్ ను చెప్పుకొచ్చిన చంటి.. తాను విమానం ఎక్కిన వెంటనే నిద్రపోయానని.. నిద్రలో తన కాలు తగిలిందేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. నిద్రలో కాలు తగిలిన విషయం తనకు తెలీదని.. తర్వాత స్టీవార్డు వచ్చి తనకు వేరే సీటు చూపిస్తే తాను వెళ్లిపోయానని చెప్పారు.
తనకు విషయం తెలిసి ఉంటే సదరు మహిళకు తాను క్షమాపణలు చెప్పేవాడినని.. మహిళల్ని అక్కలు.. చెల్లెళ్లుగా చూస్తానని మచ్చలేని రాజకీయ జీవితాన్ని తాను నడుపుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. చంటి మీద నమోదైన ఫిర్యాదు కానీ నిరూపణ అయి దోషిగా తేలితే మూడేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుందని అంచనా వేస్తున్నారు. అయినా.. ఫ్లైట్ ఎక్కిన వెంటనే నిద్రపోవటం ఏమిటి చంటి? పక్కనున్నది ఆడవాళ్లు అయినప్పుడు నిద్రలో ఏదైనా తగులుతుందేమోనన్న ముందుజాగ్రత్త తో ఉండాలి కదా..?
Full View