ఉండవల్లి నమ్మకాన్ని చంద్రబాబు దెబ్బ కొట్టారంట

Update: 2015-12-01 09:32 GMT
మాటలతో తిమ్మినిబమ్మిని చేయగల నేతలు ఏపీలో చాలా కొద్ది మందే కనిపిస్తారు. ఇక. విషయం నిండుగా ఉండి.. దానికి వాగ్ధాటి ఉన్న వారు వేళ్ల మీద లెక్కించే పరిస్థితి. అలాంటి కొద్దిమందిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఆయన.. 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ విజయం సాధించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు వెల్లడించారు. విభజన నేపథ్యంలో ఏపీ విపత్కర పరిస్థితిలో ఉందని.. ఇలాంటి సమయంలో చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత చేతికి ఏపీ పాలనా పగ్గాలు చేతికి వస్తే.. ఏపీ పరిస్థితి బాగు అవుతుందని తాను ఆశించినట్లు తాజాగా వెల్లడించారు.

ఈ కారణంతోనే 2014 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో చంద్రబాబు విజయం సాధించాలని తాను బలంగా కోరుకున్నానని.. కానీ.. ఆయనపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు పాలన చూస్తుంటే.. ఆయన్ను సమర్థించి తాను తప్పు చేసినట్లుగా భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబు సర్కారు విడుదల శ్వేతపత్రం అవాస్తవాలతో నిండిందని.. మంత్రి యనమల రామకృష్ణుడి చేత అబద్దాలు చెప్పిస్తున్నారంటూ మండిపడ్డారు. బాక్సైట్ కంపెనీలకు వైఎస్ జగన్ కానీ బినామీగా ఉంటే.. ఆయనపై తక్షణమే కేసులు పెట్టొచ్చుగా అని నిలదీశారు.
Tags:    

Similar News