నిన్నటికి నిన్న రిపబ్లిక్ సి ఓటర్.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ ఒక సర్వే ప్రచారం చేసింది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం.. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ రిపబ్లిక్ సి ఓటర్ తేల్చిచెప్పింది. అయితే.. టీడీపీకి కూడా సీట్లు బాగానే వస్తున్నా మ్యాజిక్ నెంబర్‌కు మాత్రం కాస్త దూరంలో ఆగిపోతుంది అని చెప్పింది. అయితే అన్నింటికింటే ఆశ్చర్యకరమై విషయం ఏంటంటే.. ఈ రిపబ్లిక్ సి ఓటర్ సర్వేలో అసలు జనసేన ప్రభావం చూపే అవకాశమే లేదని తేల్చిచెప్పింది. ఇంకా చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదని చెప్పేసింది.
జనసేనకు సున్నా సీట్లు రావడం - సర్వే రిపోర్ట్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సున్నా సీట్లు వస్తాయని తాను నమ్మడం లేదని అన్నారు. కచ్చితంగా జనసేన చాలా నియోజకవర్గాల్లో ప్రభావితం చూపుతుందని ఆయన జోస్యం చెప్పారు. సర్వే రిపోర్టులు చాలా సార్లు తప్పని ప్రూవ్ అయ్యిందని.. అయినా ఇప్పుడు సర్వేల్ని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరని ఆయన అన్నారు. జనవరి 29న ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలతో విజయవాడలోని ఐలాపురం హోటల్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. దీనికి జనసేన నుంచి పవన్ కల్యాణ్ హాజరవుతానని తనకు మాట ఇచ్చారని అన్నారు ఉండవల్లి.