పొలిటిక‌ల్ చ‌ర్చ‌పై ఉండ‌వ‌ల్లి క్లారిటీ

Update: 2016-09-02 10:29 GMT
కాంగ్రెస్ నుంచి జ‌గ‌న్ పార్టీ వైకాపాలోకి జంప్‌ చేస్తారంటూ.. గ‌త కొన్నాళ్లుగా త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు రాజ‌మండ్రి మాజీ ఎంపీ - సీనియ‌ర్ పొలిటీషియ‌న్ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్ లేటెస్ట్‌ గా క్లారిటీ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే, తాను ఏ పొలిటిక‌ల్ పార్టీలోనూ లేన‌ని చెప్పేశారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న అధికార టీడీపీ పై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా మంత్రి నారాయ‌ణ‌కి సంబంధించి ఉండ‌వ‌ల్లి కీల‌క కామెంట్లు చేశారు. దేశంలోనే అత్య‌ధిక ధ‌న‌వంతుడైన మంత్రిగా నారాయ‌ణ ఉండ‌డాన్నిఆయ‌న ప్ర‌శ్నించారు. నారాయ‌ణ‌కి రూ.474 కోట్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని ప్ర‌శ్నించిన ఉండ‌వ‌ల్లి నారాయ‌ణ విద్య‌ను వ్యాపారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

 దీనికి మంత్రి నారాయ‌ణ కూడా కౌంట‌ర్ ఇచ్చారు. ఉండ‌వ‌ల్లి.. ఊస‌ర‌వెల్లి అంటూ స‌టైరిస్టిక్‌ గా వ్యాఖ్య‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే ఉండ‌వ‌ల్లి వైకాపాలో చేరుతున్నార‌ని, అందుకే ప్ర‌భుత్వాన్ని - మంత్రుల‌ను ఆయ‌న విమ‌ర్శిస్తున్నార‌ని టీడీపీలో ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే, లేటెస్ట్‌ గా శుక్ర‌వారం మీడియాతో మీటింగ్ పెట్టిన ఉండ‌వ‌ల్లి.. ఆ ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చారు. తాను ఏ రాజ‌కీయాల్లోనూ  లేన‌ని చెప్పారు. వ్యక్తిగత అంశాలపై తనకు మెసేజ్ లు ఏమీ పెట్టొద్దని ఆయన రాజకీయ నేతలకు సూచించారు. అదే స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ త‌న‌కు శ‌తృవేమీ కాద‌ని కూడా ఉండ‌వ‌ల్లి చెప్పారు.

అదేస‌మ‌యంలో మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న కామెంట్లు చేశారు. ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టు పట్టిసీమ‌తోనే న‌దుల అనుసంధానం జ‌రిగింద‌ని చెప్ప‌డం అవాస్త‌వ‌మ‌న్నారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల తరలింపు సాధ్యం కాద్నారు. దీనిపై చర్చకు వస్తే నిరూపిస్తానని మ‌రోసారి స‌వాల్ చేశారు. అయితే, ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల‌పై మ‌రోసారి సోష‌ల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ఇప్ప‌టికి తాను ఏ రాజ‌కీయ పార్టీలోనూ లేనంటే.. రాబోయే రోజుల్లో తాను వైకాపాలోకి చేరే ఛాన్స్ ఉంద‌ని ఆయ‌న చెబుతారా? అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రి దీనిపై ఉండ‌వ‌ల్లి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News