ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు మహాజోరుగా సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయలా ఆదాయం సమకూరుతోంది. నిజానికి ప్రభుత్వాలు నడుస్తున్నది ఎక్సైజ్ ఆదాయంతోనే. అందుకే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం సేవించే వారు వారం రోజులు బంద్ పాటిస్తే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ఆదాయం వెనుక పన్ను పేరుతో పెద్ద దోపిడి జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. మద్యంపై నూటికి మూడువందల శాతం అధిక పన్నుతో ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తోందని ఇదీ శ్రేయస్కరం కాదని ఉండవల్లి అభిప్రాయం.
యభై రూపాయలకు విక్రయిస్తున్న చీప్ లికర్ పై ప్రభత్వానికి వస్తున్న ఆదాయం రూ 37.75 పైసలు. ఈ చీప్ లిక్కర్ తయారీకి కేవలం రూ 8. 50 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది ఇందులో సరుకు రవాణా కూడా ఉండడం ఓ విశేషం. ఇక ఒక చీప్ లిక్కర్ బాటిల్ విక్రయిస్తే షాపు యజమానికి వచ్చే ఆదాయం రూ.3.75 పైసలు. ఈ రెండూ కలపగా వచ్చే ఖర్చును అమ్మకపు ధరతో చూస్తే ప్రభుత్వానికి ఒక క్వాటర్ బాటిల్ పై రూ.37. 75 పైసలు వస్తుంది. ఈ చీప్ లిక్కర్ ను తీసుకునే వారి సంఖ్య లక్షలలోనే ఉంటుంది. దీంతో ఒక్క చీప్ లిక్కర్ ద్వారానే ప్రభత్వానికి కోట్లాది రూపాయలు పన్నుల రూపంలో చేరుతోందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణ. చీప్ లిక్కర్ తర్వాత విక్రయించే బ్రాండ్ డిఎస్పీ అంటే డైరెక్టర్ స్పేషల్ ఈ మద్యం క్వాటర్ బాటిల్ ఖరీదు 80 రూపాయలు. దీని తయారి - రవాణా - అమ్మకం దారుణి కమీషన్ కు అన్నింటికి కలిపి అయ్యే ఖర్చు రూ. 10.30 పైసలు. ఈ మద్యంపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం క్వాటర్ కు 70 రూపాయలు. ఇంత పెద్ద ఎత్తున పన్నుల భారం వేసి సామాన్యులను మద్యానికి బానిసలను చేస్తున్నారని లోక్ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రజలు తినే తిండి మీద తప్ప అన్నింటి పైన భారీగా పన్నులు వేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చీటికిమాటికి మద్యం రేట్లను పెంచడం వెనుక అధిక రాబడే కారణం అని ఆయన అంటున్నారు.