నల్లకోటు వేయనున్న ఉండవల్లి

Update: 2016-01-25 09:59 GMT
ఏదైనా విషయంలో ఎంటరైతే అంత తొందరగా విడిచిపెట్టని ఉడుంపట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా పట్టిసీమ ప్రాజెక్టుపై పోరాటానికి దిగుతున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన నల్లకోటు వేసుకుని న్యాయవాది అవతారమెత్తబోతున్నారు.  గతంలో మార్గదర్శి వంటి కేసుల్లో రామోజీరావు వంటి ఉద్ధండులకే చుక్కలు చూపించిన ఉండవల్లి అలాంటి సందర్భాల్లో కూడా ఎన్నడూ నల్లకోటు వేసుకోలేదు. కానీ, గోదావరి జిల్లాల ప్రయోజనాలు కాపాడడానికంటూ ఇప్పుడు న్యాయవాదిగా కోర్టులో తన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.
    
కాంగ్రెస్ సీనియర్లలో ఒకరైన ఉండవల్లి కొద్దికాలంగా పార్టీలో చురుగ్గా ఉండడం లేదు. దీంతో ఆయన ఏదో అధ్యయనంలో మునిగిపోయారని చాలామంది అనుకున్నారు. ఇప్పడు అదే నిజమవుతోంది. ఇంతకాలం ఆయన పట్టిసీమపై మొత్తం సమాచారం సేకరించుకుని ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగుతున్నారు.  కాగా మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పట్టిసీమపై ఈ కేసు వేశారు. ఆయన వేసిన కేసులో వాదనలు వినిపించేందుకు గాను ఉండవల్లి న్యాయవాదిగా మారనున్నారు. అయితే, ఇంకా దీనికి కోర్టు నుంచి అనుమతులు రావాల్సి ఉంది.
Tags:    

Similar News